Breaking News

దరఖాస్తుతో.. దేవుడి భూములు!

Published on Sat, 01/10/2026 - 05:59

సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆ«దీనంలోని వివిధ ఆలయాలు, సత్రాలు, మఠాలు, ఇతర ధార్మీక సంస్థల పేరిట ఉన్న విలువైన వ్యవసాయేతర భూములు, స్థలాలను ఎలాంటి బహిరంగ వేలం లేకుండా లీజుకు ఇవ్వడం, ఇప్పటికే ఉన్న  లీజులను పొడిగించేందుకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. లాభాపేక్ష లేకుండా 20 ఏళ్ల పాటు ధార్మీక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థలు కేవలం దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఐదేళ్ల వరకు లీజుకివ్వడం లేదంటే పాత లీజులు పొడిగించే అధికారాన్ని దేవదాయ శాఖ కమిషనర్‌కు కల్పించింది. లీజు ఐదేళ్లకు మించితే ఆ అధికారాన్ని దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉండే ధార్మీక పరిషత్‌కు కల్పించింది. అయితే గతంలో దేవదాయ శాఖ జారీ చేసిన జీవో 426 ప్రకారం దేవాలయాలకు సంబంధించిన వ్యవసాయేతర భూములను కేవలం బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజుకు ఇవ్వాలని నిర్దేశించడం గమనార్హం

నిన్న ఆమోదం.. నేడు జీవో.. 
రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న లక్షల ఎకరాల దేవుడి భూములను ఎలాంటి వేలం లేకుండా ధార్మీక సంస్థల పేరిట కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు పచ్చజెండా ఊపుతూ చంద్రబాబు ప్రభుత్వం 2025 మే 2వతేదీన ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. 30 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొంది. దాదాపు 8 నెలల తర్వాత తుది మార్గదర్శకాలను గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించగా.. శుక్రవారం జీవో ఎంఎస్‌ నెంబరు 15 ద్వారా అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే లీజు ధరలను సైతం స్పష్టంగా వెల్లడించకపోవడం గమనార్హం. అధికారుల విచక్షణ మేరకు లీజు ధరలపై నిర్ణయం తీసుకునే అధికారం కల్పించింది. 

4.67 లక్షల ఎకరాల దేవుడి భూములు... 
రాష్ట్రంలో దేవదాయశాఖ పరిధిలో ఆలయాలు, స­త్రా­లు, మఠాలు పేరిట మొత్తం 4.67 లక్షల ఎకరా­ల భూములున్నాయి. అందులో పట్టణ ప్రాంతాల్లో 4,244 ఎకరాల మేరకు అత్యంత విలువైన వ్యవసాయేతర భూములున్నాయి. వీటిలో 1.55 కోట్ల చదరపు గజాలు ఖాళీ భూములుగానూ, మరో 50 వేల చదరపు గజాలు కట్టడాల రూపంలో ఉన్నాయి.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)