Breaking News

‘ప్రైవేట్‌’ రాజధాని!

Published on Mon, 02/09/2026 - 04:10

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యం పీపీపీ, ప్రైవేట్‌ జపం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా అమరావతి రాజధానిని సైతం పీపీపీ, ప్రైవేట్‌కు అప్పగించేలా అడు­గులు ముందుకు వేసింది. గంపగుత్తగా ప్రైవేట్‌కు అప్పగించి అందినకాడికి చార్జీల రూపంలో దండుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడున్న చట్టాలను మార్చడంతో పాటు మరిన్ని కొత్త చట్టాలను రూపొందించడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఇదంతా చేసి పెట్టడానికి ప్రైవేట్‌ సంస్థలను (కన్సల్‌టెంట్‌) ఆహ్వానించింది. ఇలా ఎంపికైన కన్సల్టెంట్‌ ద్వారా పీపీపీ, ప్రైవేట్‌ ఫైనాన్సింగ్‌ కోసం చట్టపరమైన నిబంధనలను రూపొందించనుంది. 74వ రాజ్యాంగ సవరణకు లోబడి మున్సిపల్‌ చట్టాల్లో సవరణలు చేయడం ద్వారా అమరావతికి మెట్రో పాలిటిన్‌ నగరంగా స్వయం ప్రతిపత్తి కల్పించనుంది. 

రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ఏడీబీ) రుణం మంజూరు చేసిన నేపథ్యంలో ఇక అమరావతి పరిపాలన అంతా ఆ బ్యాంకుల కనుసన్నల్లోనే సాగనుంది. గత ఏడాది జూలైలో ఏడీబీ, ప్రపంచ బ్యాంకు మద్దతుతో ఏపీసీఆర్‌డీఏ ఇన్నోవేటివ్‌ అర్బన్‌ గవర్నెన్స్‌ పేరుతో మేధోమథన వర్క్‌షాప్‌ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో అమరావతి పాలనకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రస్తుత చట్టాల్లో సవరణలు చేయడంతో పాటు కొత్త చట్టాలను తీసుకురావాలని నిర్ణయించారు. పీపీపీ, ప్రైవేట్‌ రంగంలో ప్రాజెక్టులు చేపట్టేందుకు చట్టపరమైన నిబంధనలను రూపొందించాలని సంకల్పించారు. అలాగే ప్రజలకు అందించే అన్ని రకాల సేవలకు వినియోగ చార్జీలతోపాటు ఆస్తి పన్ను, ఇతర లెవీలతో అంటే ప్రజలను మరింతగా బాదడం ద్వారా బహుళ ఆదాయ వనరులను అమరావతి మెట్రో పాలిటిన్‌ నగరానికి సమకూర్చాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన చట్టాల సవరణలు, కొత్త చట్టాల రూపకల్పన, పాలనా పరమైన నిబంధనల తయారీ కోసం సీఆర్‌డీఏ కన్సల్టింగ్‌ సంస్థను ఆహ్వానించింది.

కన్సల్టింగ్‌ సంస్థ ఎంపిక కోసం కసరత్తు
⇒ అమరావతి రాజధాని నగరం కోసం పాలన అభివృద్ధి సంస్థాగత చట్రం రూపకల్పన కోసం కన్సల్టింగ్‌ సంస్థ ఎంపిక కోసం సీఆర్‌డీఏ ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని (టెండర్‌ నోటీసు) జారీ చేసింది. ప్రజా సేవల ప్రాజెక్టులైన నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి, నీటి పంపిణీ, సేకరణ, మునిసిపల్‌.. ఇతర వర్గాల ఘన వ్యర్థాలు, జిల్లా శీతలీకరణ, విద్యుత్‌ సరఫరా మొదలైనవి పీపీపీలో చేపట్టనున్నారు. 
⇒ ప్రపంచ బ్యాంకు కనుసన్నల్లోనే ఈ చట్టాల సవరణలు, కొత్త చట్టాల రూపకల్పన జరగనుంది. రాజధాని ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు భూములు అమ్ముకోవడానికి (మానిటైజ్‌) హక్కులు కల్పించే విధంగా మున్సిపల్‌ చట్టాల్లో మార్పులు చేయనున్నారు. ముఖ్యంగా రాజధాని ఆర్థిక వనరులను అంచనా వేసి.. స్థిరమైన రాబడి, పీపీపీ, ప్రైవేటు పెట్టుబడికి అవసరమైన విధంగా చట్ట పరమైన ఫ్రేమ్‌ వర్క్‌ను రూపొందించనున్నారు.

⇒ అమరావతికి స్వయం ప్రతిపత్తి, జవాబుదారీతనం, సామర్థ్యం కోసం చట్టపరమైన నిబంధనలు ఉండాలని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ప్రభుత్వం నుండి ఆర్థిక మద్దతు, రాజధానికి ఆదాయం, స్వయం ప్రతిపత్తి, సంస్థలకు అప్పగించిన భూమి విక్రయించుకునేందుకు అనుమతులు.. వీటన్నింటినీ మానిటైజేషన్‌ చేయడానికి కొత్త ఫ్రేమ్‌ వర్క్‌ను తయారు చేయనున్నారు.
⇒ సీఆర్‌డీఏ చట్టాలను పరిశీలించి 74వ రాజ్యాంగ సవరణకు లోబడి స్వయం ప్రతిపత్తి కల్పించేందుకు అవసరమైన అన్ని అంశాల్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. దక్షిణ కొరియా, యుఎస్‌ఏ, దక్షిణాఫ్రికాతో పాటు పంజాబ్, గుజరాత్, మహారాష్ట్రాల్లో నిబంధనలను పరిశీలించడంతో పాటు అందుకు అనుగుణంగా ఇక్కడ కూడా అలాంటి రవాణా నెట్‌వర్క్‌లు, పర్యావరణ ప్రణాళిక, హైబ్రిడ్‌ గవర్నెన్స్‌ ఏర్పాట్లను రూపొందించనున్నారు. 
⇒ మున్సిపల్‌ పాలన, సంప్రదాయ నమూనాలు అమరావతి స్థాయికి సరిపోవని, ఈ నేపథ్యంలో ప్రత్యేక పాలన ఫ్రేమ్‌ వర్క్‌కు చట్టపరమైన నిబంధనలు అవసరమని నిర్ణయించారు.  


ప్రత్యేక పాలన ఫ్రేమ్‌ వర్క్‌ ఇలా..
⇒ ఢిల్లీ, చండీగఢ్, నవీ ముంబై, గాంధీనగర్, న్యూ టౌన్‌ కోల్‌కతాతో సహా ప్రపంచ రాజధాని నగరాలైన బ్రెజిలియా, పుత్రజయ, సెజోంగ్, అస్తానా, నుసంతారా, సింగపూర్, జోహన్నెస్‌బర్గ్‌ మెట్రో పాలిటన్‌ ప్రాంతాల పాలన ఏర్పాట్లను పరిశీలించడం ద్వారా చట్టపరమైన స్వయం ప్రతిపత్తి పాలన, ఆర్థిక అధికారాలు, ఆదాయ ఏర్పాట్లు, § ప్రణాళిక అభివృద్ధి కోసం ఉత్తమ విధానాలు రూపకల్పన. 
⇒ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మున్సిపల్, కార్పొరేషన్‌ చట్టాలకు మించి ప్రత్యేక చట్టాలు రూపొందించడం. పరిపాలన కోసం అత్యున్నత మండలిని ఏర్పాటు చేయడం, రవాణా, విపత్తు నిర్వహణ వంటి అంశాల కోసం ప్రత్యేక ఏజెన్సీలనూ నియమించేందుకు వీలుగా చట్టాల రూపకల్పన. 



⇒ అన్ని అంశాలలో మార్గ నిర్దేశం చేయడానికి రాజధాని నగరంలో వివరణాత్మక పాలనా వ్యవస్థలను అభివృద్ధి చేయడం.
⇒ అమరావతి సంస్థాగత రూపకల్పనలో రెవెన్యూ మోడల్‌లో భాగంగా పన్ను, వినియోగదారు చార్జీలు, భూమి విక్రయం విలువ, అంతర్గత ప్రభుత్వ ఆర్థిక బదిలీ, ఆర్థిక వనరులను పంచుకోవడానికి రాజధాని నగరంలో ఏర్పాట్లు. సేవల పంపిణీ విధానం, ప్రైవేట్‌ రంగ ప్రమేయం పరిధి నిర్ణయించడం.
⇒ రాజధాని ఆర్థిక వనరులను అంచనా వేసి.. పీపీపీ, ప్రైవేటు పెట్టుబడికి అవసరమైన విధంగా చట్టపరమైన ఫ్రేమ్‌ వర్కును రూపొందించడం.

⇒ బలమైన ఆర్థిక సాధనాల సమితిని సిఫార్సు చేయాలి. ఆస్తి పన్ను, వినియోగదారు చార్జీలు, భూమి విలువ, ఇతర లెవీలతో సహా బహుళ ఆదాయ వనరులను సృష్టించే మార్గాలు వెల్లడించాలి. 
⇒ ఆర్థిక వికేంద్రీకరణ, పీపీపీ సౌకర్యాల రక్షణ చర్యల కోసం చట్టపరమైన చర్యలను సూచించాలి.
⇒ పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల సేవలు, భూమి నిధుల కోసం నియంత్రణ చట్రాలను ప్రతిపాదించాలి.
⇒ భూములను ఆర్థిక వనరులుగా మార్చడంతో (క్రయవిక్రయాలు) పాటు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం–రాజధాని అమరావతి మధ్య ఆర్థిక పంపిణీ జరిగేలా చట్టాన్ని రూపొందించాలి.
⇒ ఆదాయ మార్గాల యంత్రాంగాలపై మాన్యువల్‌ రూపకల్పన.
⇒ అమరావతి జిల్లాగా ప్రకటించిన సందర్భంలో భూ ఆదాయానికి సంబంధించి జిల్లా పరిపాలన పాత్రను నిర్వచించాలి.

⇒ మౌలిక సదుపాయాలు, సేవా స్థాయిలను కొనసాగించడానికి అవసరమైన వనరులను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక వేయడంతోపాటు నిధుల సమీకరణ సూచించాలి.
⇒ నిర్దిష్ట పట్టణ విధులు, సేవలు, మూల ధన పెట్టుబడులు, నిర్వహణ వ్యయం, పట్టణ ప్రణాళిక అభివృద్ధి వంటి స్పష్టమైన బాధ్యతలతో అమరావతి పట్టణాన్ని పరిపాలించే.. నిర్వహించే అధికారాలను సూచించాలి.
⇒ సుంకాలు, పన్నులు, వినియోగదారు చార్జీలను నిర్ణయించడం, వసూలు చేయడం, రుణ ఫైనాన్సింగ్‌ కోసం మూల ధన మార్కెట్లను యాక్సెస్‌ చేసే అధికారాలు, ప్రస్తుత అభివృద్ధి దశ నుండి క్రియాత్మక కార్యాచరణ నగరం వరకు ఇన్‌స్టాలేషన్‌ ట్రాన్స్‌మిషన్‌ కోసం స్పష్టమైన రోడ్‌ మ్యాప్‌ను అందించాలి.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)