Breaking News

సబ్‌ ప్లాన్‌కు చిల్లు.. కోతల ‘ప్లాన్‌’

Published on Thu, 02/19/2026 - 04:51

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీలను ఎగ్గొడుతూ.. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సైతం నిలిపివేసిన చంద్రబాబు సర్కారు కనీసం ఉప ప్రణాళిక నిధులైనా వ్యయం చేయకుండా బడుగు, బలహీన వర్గాలను దారుణంగా వంచిస్తోంది. సబ్‌ ప్లాన్‌ నిధులను కాగితాలపై చూపిస్తూ.. ఖర్చు పెట్టకుండా మురగబెడుతోంది. 

సబ్‌ప్లాన్‌ నిధులను ఖర్చు చేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చంద్రబాబు సర్కారు రెండేళ్లలో ఎగ్గొట్టిన మొత్తం ఏకంగా దాదాపు రూ.27,000 కోట్లు!! గత రెండు బడ్జెట్ల గణాంకాల సాక్షిగా చంద్రబాబు సర్కారే దీన్ని ఒప్పుకుంది! విద్య, వైద్యం, ఉపాధి,  తాగునీరు, వ్యవసాయం.. సంక్షేమం కోసం ఉప ప్రణాళిక నిధులను వ్యయం చేయాలి. విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు ఉప ప్రణాళిక నుంచి అందించాలి. సంక్షేమానికి రూ.వేల కోట్లు కోత పడటంతో ఆయా వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.  

భారీ కేటాయింపులు చూపిస్తూ మోసం..  
2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ఉత్త కేటాయింపులు మినహా ఖర్చు చేయలేదని చంద్రబాబు ప్రభుత్వమే సవరించిన బడ్జెట్‌ అంచనాల్లో వెల్లడించింది. కేవలం బడ్జెట్‌లో భారీ కేటాయింపులు చూపించి మోసం చేయడం మినహా వాస్తవంగా ఖర్చు చేయడం లేదని బహిర్గతమైంది. 


గత రెండు ఆర్థిక సంవత్సరాల (2024–25, 2025–26) బడ్జెట్ల కేటాయింపుల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ ఉప ప్రణాళికలకు ఏకంగా రూ.9,591 కోట్లు కోత విధించింది. ఇక ఎస్టీ సబ్‌ప్లాన్‌  కేటాయింపుల్లో ఏకంగా రూ.3,695.23 కోట్లు కోత పెట్టింది. బీసీ సంక్షేమానికి గత రెండు బడ్జెట్ల కేటాయింపుల్లో ఏకంగా రూ.12,426 కోట్లు కోత విధించింది. మైనారిటీ సంక్షేమానికి గత రెండు బడ్జెట్‌ కేటాయింపుల్లో రూ.1,132 కోట్ల మేర కోత విధించింది.  

ఆగిపోతున్న పిల్లల చదువులు...! 
చంద్రబాబు సర్కారు ప్రచారం కోసం ఎక్కువ మొత్తంలో సబ్‌ప్లాన్‌కు కేటాయింపులు చేస్తున్నట్లు బడ్జెట్లలో చూపిస్తోంది. కేటాయింపుల మేరకు ఆయా వర్గాల సంక్షేమం, ఆర్థికాకాభివృద్ధికి చేయూతనివ్వకుండా మోసగిస్తోంది. విద్యార్ధులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు ఉప ప్రణాళిక నుంచే అందించాలి. వీటిని ఎగ్గొట్టడంతో పేదింటి పిల్లలు చదువులు అర్థాంతరంగా ఆగిపోతున్నాయి. 

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ పేదల గృహ నిర్మాణం కోసం బడ్జెట్లో రూ.4,642 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో కేవలం రూ.545.51 కోట్లకే పరిమితం చేయడం గమనార్హం. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం పట్ల చంద్రబాబు సర్కారు ఎంత చిన్న చూపు చూస్తోందో స్పష్టం అవుతోంది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)