Breaking News

మూడు నెలల్లో మళ్లీ రూ.17,500 కోట్ల అప్పు

Published on Sat, 01/03/2026 - 06:00

సాక్షి, అమరావతి: అప్పుల క్యాలెండర్‌తో చంద్రబాబు సర్కారు దూసుకుపోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు నెలల్లో (జనవరి నుంచి మార్చి వరకు) బాబు సర్కారు రూ.17,500 కోట్లు బడ్జెట్‌ అప్పు చేయనుంది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ఇండెంట్‌ పెట్టడంతో ఆర్‌బీఐ శుక్రవారం మూడు నెలల బాబు సర్కారు అప్పుల క్యాలెండర్‌ను ప్రకటించింది. బాబు ప్రభుత్వం ఇన్ని అప్పులు చేస్తున్నా, సూపర్‌ సిక్స్‌తో పాటు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు, పథకాలు, యువతకు ఉద్యోగాలు, కార్యక్రమాల అమలు క్యాలెండర్‌ను మాత్రం ప్రకటించడం లేదు.

ప్రజలకిచ్చిన ప్రధాన హామీలు కూడా అమలు చేయడం లేదు. ఈ క్రమంలో మూడు నెలల్లో చేసే అప్పుల్లో వచ్చే మంగళవారం అంటే ఈ నెల 6వ తేదీన రూ.6,500 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యురిటీలను వేలం వేయడం ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్‌బీఐ ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ఆర్‌బీఐ నోటిఫై చేసింది. గత మంగళవారం నాడే బాబు సర్కారు రూ.4,000 కోట్లు అప్పు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వారం వ్యవధిలోనే రూ.6,500 కోట్లు అప్పు చేస్తోంది. అంటే వారం వ్యవధిలోనే బాబు సర్కారు ఏకంగా రూ.10,500 కోట్లు అప్పు చేసినట్లవుతోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)