Breaking News

మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.300 కోట్లు అప్పు

Published on Tue, 07/28/2026 - 05:38

సాక్షి, అమరావతి: బడ్టెట్‌ లోపల బడ్జెట్‌ బయట అప్పులు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతోంది. మార్కెఫెడ్‌ ద్వారా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుంచి టర్మ్‌ రుణం రూ.300 కోట్లు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులిచ్చింది. అసలు, వడ్డీకి ప్రభుత్వ గ్యారెంటీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మార్క్‌ఫెడ్‌ రుణ సంస్థ్ధకు తన బాధ్యతలను చెల్లించడంలో విఫలమైన సందర్భంలో ప్రభుత్వ గ్యారెంటీ అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.

మార్క్‌ఫెడ్‌ తన సొంత నిధుల నుంచి రుణ సేవలను భరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వడ్డీ రేటు, కాల వ్యవధి, మారటోరియం కాలం మొదలైన వివరాలతో పాటు, ఏవైనా షరతులు ఉంటే వాటితో సహా, అసలు, వడ్డీ తిరిగి చెల్లించే షెడ్యూల్‌ను సమర్పించాలని అందులో పేర్కొంది. గ్యారెంటీ ఇచ్చిన మొత్తంపై ఐదు శాతం గ్యారెంటీ కమీషన్‌ చెల్లించాలని తెలిపింది. ఇందుకు అనుగుణంగా మార్క్‌­ఫెడ్‌ ఎండీ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ఇప్పటికే మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.21,700 కోట్ల మేర చంద్రబాబు ప్రభుత్వం అప్పు చేసింది. ఇప్పుడు చేసే రూ.300 కోట్ల అప్పుతో మార్క్‌ఫెడ్‌ ద్వారా చేసిన అప్పు రూ.22,000 కోట్లకు చేరింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)