Breaking News

పీ–4 ఖర్చు.. బాగా హెచ్చు

Published on Fri, 06/19/2026 - 04:50

సాక్షి, అమరావతి: సంపన్నులను పేదలతో అనుసంధానించి.. పేదరికాన్ని నిర్మూలిస్తామంటూ పీ–4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కారు సభల పేరుతో ప్రభుత్వ సొమ్మును దుబారా చేస్తోంది. పీ–4 ప్రథమ వారికోత్సవ వేడుకల్ని నిర్వహించేందుకు రూ.3.07 కోట్లు వెచ్చించేందుకు ప్రణాళికా శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్‌ కుమార్‌ గురువారం పరిపాలన అనుమతి మంజూరు చేశారు. ఈ మొత్తం ఒక్క రోజు వేడుకలు నిర్వహించేందుకు అయిన వ్యయంగా పేర్కొన్నారు. 

సీఎం చంద్రబాబు ఈ ఏడాది మార్చి 30న తిరుపతిలో పీ–4 ప్రథమ వార్షికోత్సవ సభలో పాల్గొన్నారు. దీని కోసం రూ.80 లక్షలు విడుదల చేశారు. అలాగే జిల్లా స్థాయిల్లో ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు జిల్లాకు రూ.2 లక్షల  చొప్పున 26 జిల్లాలకు రూ.52 లక్షలను విడుదల చేశారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వేడుకలకు నియోజకవర్గానికి రూ.లక్ష చొప్పున  రూ.175 లక్షల్ని విడుదల చేశారు. 

సభలు, వేడుకల ఖర్చు రూ.9.15 కోట్లు
గత ఏడాది మార్చి 30న సచివాలయం వెనుక పీ–4 పాలసీ ప్రారంభోత్సవం పేరుతో సీఎం చంద్రబాబు ఒకపూట సదస్సు నిర్వహించారు. ఆ సదస్సుకు గతంలోనే ప్రణాళికా శాఖ రూ.5.61 కోట్లను విడుదల చేసింది. గత ఏడాది ఆగస్టు 19న మంగళగిరిలోని సీ.కే. కన్వెన్షన్స్‌లో సీఎం చంద్రబాబు నిర్వహించిన పీ–4 కార్యక్రమానికి ఖర్చుల నిమిత్తం రూ.47.10 లక్షలకు పరిపాలన అనుమతి ఇస్తూ ప్రణాళిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటివరకు పీ–4 సభలు, వేడుకల పేరుతో చంద్రబాబు సర్కారు రూ.9.15 కోట్లను వ్యయం చేసింది.

పేదరిక నిర్మూలన కోసం పేదలకు నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుల పేరుతో రూ.కోట్లు వెచ్చిస్తోంది. సంపన్నులైన 10 శాతం కుటుంబాలు పేదరికంలో ఉన్న కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావాలి. ఈ కార్యక్రమం కోసం సదస్సులు, వేడుకల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికే ఏకంగా రూ.9.15 కోట్లు వ్యయం చేయడంపై అధికార వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)