Breaking News

సీపీఎస్‌ ఉద్యోగులకు వెన్ను పోటు!

Published on Tue, 07/14/2026 - 04:36

సాక్షి, అమరావతి: అందరినీ మోసం చేసినట్లే చంద్రబాబు ఉద్యోగులనూ మోసగించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా తుంగలో తొ­క్కుతూ పాలన సాగిస్తున్నారు. సీపీఎస్‌ ఉద్యోగులకు మేనిఫేస్టోలో ఇచ్చిన హామీకి మంగళం పాడేశారు. అధికారంలోకి రాగానే సీపీఎస్, ఓపీఎస్‌ వి­ధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరి­ష్కారానికి కృషి చేస్తామని ఎన్నికల మేనిఫేస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండేళ్ల పాలన పూర్తయినప్పటికీ ఆ హామీని నెరవేర్చడానికి ఎటువంటి చర్యలనూ తీసుకోకుండా లక్షలాదిమంది సీపీఎస్‌ ఉద్యోగులను మోసం చేశారు.

సీపీఎస్‌ ఉద్యోగులకు సంబంధించి సోమవారం ప్రభుత్వమిచ్చి న ఉత్తర్వులే దీనికి నిదర్శనం. 2004 సెపె్టంబర్‌ 1­కి ముందు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్‌లు జారీ చేసి, దాని ఆధారంగా ఆ తరువాత ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు మాత్రమే అది కూడా ఒకేసారి సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు అవకాశమిస్తూ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. దీనివల్ల కేవలం 10 వేల మంది ఉద్యోగులకు మాత్రమే సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు అవకాశం కలిగింది. మిగతా మూడు లక్షల మంది సీపీఎస్‌ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఈ పదివేల మందికి అవకాశం కల్పిస్తూ ఇచ్చిన జీవో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇచ్చిందే తప్ప చంద్రబాబుకు ఉద్యోగుల విషయంలో ఎలాంటి చిత్తశుద్ధీలేదని స్పష్టమయ్యింది. 

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)