Breaking News

వారికి నోటీసులు ఆపండి!

Published on Thu, 08/21/2025 - 06:06

సాక్షి, అమరావతి: అనర్హులంటూ రాష్ట్రంలోని లక్షలాది మంది దివ్యాంగ పింఛనుదారులకు కొద్దిరోజులుగా జారీచేస్తున్న నోటీసులను కొందరికి నిలుపుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పింఛను కార్యక్రమాలను పర్యవేక్షించే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈఓ ఈ మేరకు సూచించారంటూ సెర్ప్‌ అధికారులు అన్ని జిల్లాల అధికారులకు బుధవారం సమాచారం ఇచ్చారు. 

ఇందుకు సంబంధించిన జాబితాలను జిల్లాల వారీగా సెర్ప్‌ కార్యాలయం అందజేస్తుందని వారు తెలిపారు. నిజానికి.. టీడీపీ కూటమి ప్రభుత్వం పింఛన్ల భారాన్ని తగ్గించుకునేందుకు దివ్యాంగులను ప్రధానంగా టార్గెట్‌ చేసింది. వీరి సంఖ్యను భారీగా కుదించేందుకు 10–15 ఏళ్లకు పైగా పింఛను పొందుతున్న లబ్ధిదారులకు కొత్తగా మళ్లీ వైద్య పరీక్షలు అంటూ హడావుడి చేస్తోంది. మీకు 40 శాతం కంటే తక్కువగా వైకల్యం ఉంది, పింఛనుకు అనర్హులంటూ ప్రతి జిల్లాలో వేలాది మంది లబ్ధిదారులకు నోటీసులు జారీచేస్తోంది. 

ఇప్పటికే నాలుగున్నర లక్షల పింఛన్లకు కోత..
గత ప్రభుత్వ హయాంలో 66.34 లక్షల మందికి పైగా పింఛన్లు అందించగా.. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాదిలో దాదాపు నాలుగున్నర లక్షల పింఛన్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఈ ఆగస్టులో పంపిణీ చేసిన మొత్తం పింఛన్లు 62.19 లక్షలే. ఇప్పుడు దీనికి అదనంగా లక్షలాది మంది దివ్యాంగ, వైద్య పింఛనుదారులకు అనర్హత పేరుతో నోటీసులు జారీచేస్తుండడంపై ‘సాక్షి’ బుధవారం ‘పింఛన్లు.. కకావికలం’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీంతో.. మెంటల్‌ రిటార్డేషన్, మానసిక అనారో­గ్యంతో బాధపడుతున్న 18 ఏళ్లలోపు పిల్లలకు జారీచేసే నోటీసులను నిలుపుదల చేయాలంటూ సెర్ప్‌ సీఈఓ ఆదేశాలు జారీచేశారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)