Breaking News

AP: రాజధాని కోసం బలవంతంగా భూములు లాక్కోవాలని నిర్ణయం

Published on Fri, 10/03/2025 - 18:30

విజయవాడ:  ఇప్పటికే ఎన్నో వేల ఎకరాలను అమరావతి రాజధాని కోసం సేకరించిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు బలవంతపు భూ సేకరణ కోసం సిద్ధమైంది.   ఎవరైనా భూములు ఇవ్వను అంటే మాత్రం బలవంతంగా లాక్కోవాలని నిర్ణయిచింది. ఈ మేరకు దీనికి ఏపీ కేబీనెట్‌ ఆమోదం తెలిపింది  ల్యాండ్‌ పూలింగ్‌లో భాగంగా భూములు ఇవ్వనివారి నుంచి బలవంతంగా లాక్కోవాలని నిర్ణయించారు 

గతంలో స్వచ్ఛందంగా భూములు తీసుకుంటామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇప్పుడు భూమలు ఇవ్వనివారిపై జులుం ప్రదర్శించేందుకు రంగం సిద్ధం చేశారు.  దాంతో రెండో విడతలో భూముల కోసం రైతులకు ప్రభుత్వం పరోక్షంగా హెచ్చరించినట్లయ్యింది. 

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పటివరకు అమరావతి రాజధాని కోసం సుమారు 79,365 ఎకరాలు భూమిని సేకరించింది. ఇందులో 34,689 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా, మరో 44,676 ఎకరాలు తాజా భూసేకరణ ద్వారా పొందనున్నారు

 రాజధాని కోసం చంద్రబాబు ప్రభుత్వం భూ సేకరణ వివరాలు ఇలా..
ల్యాండ్ పూలింగ్ ద్వారా (2014–2019)
34,689 ఎకరాలు 29 గ్రామాల నుంచి రైతుల సహకారంతో సేకరించారు.
రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు, విద్య, ఆరోగ్య సదుపాయాలు హామీ ఇచ్చారు.

తాజా భూసేకరణ (2025)
44,676 ఎకరాలు అదనంగా సేకరించేందుకు సీఆర్డీఏ ప్రణాళిక సిద్ధం

గ్రామాలు
తూళ్లూరు మండలం: హరిచంద్రాపురం, వడ్డమాను, పెదపరిమి – 9,919 ఎకరాలు
అమరావతి మండలం: వైకుంఠపురం, ఎండ్రాయి, కార్లపూడి, మొత్తడాక, నిడముక్కల – 12,838 ఎకరాలు
తాడికొండ మండలం: తాడికొండ, కంతేరు – 16,463 ఎకరాలు
- మంగళగిరి మండలం: కాజా – 4,492 ఎకరాలు

గతంలో రైతుల కోసం హామీలు ఇలా..
బలవంతం లేకుండా భూసేకరణ
ప్రోత్సాహక ప్యాకేజీలు
భవిష్యత్తు మౌలిక వసతులపై హామీ

ఇప్పుడు ఇలా..
భూములు ఇవ్వకపోతే బలవంతంగా సేకరించేందుకు నిర్ణయం​

ఇదీ చదవండి: 
‘చంద్రబాబుకు ఎస్సీలంటే మొదట్నుంచీ చిన్నచూపు’
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)