Breaking News

అప్పుల్లో బాబు సర్కార్ రికార్డు

Published on Wed, 02/25/2026 - 05:44

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రా­న్ని అప్పుల ఊబిలోకి నెట్టేయడంలో తన రికార్డులను తానే బద్దలు కొట్టారు. 2014–19 మధ్య ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రూ.2,49,530 కోట్లు అప్పు చేసిన ఆయన.. ఇప్పుడు రెండేళ్లు కూడా పూర్తవకుండానే ఆ రికార్డును అధిగమించారు. 20 నెలల్లోనే ఏకంగా రూ.3,28,321 కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పులఊబిలో ముంచేశారు. మంగళవారం వస్తే చాలు అప్పుల పరంపరను కొనసాగిస్తున్నారు. 

ఈ క్రమంలో ఈ మంగళవారం 7.70 శాతం వడ్డీతో చంద్రబాబు సర్కారు రూ.3,100 కోట్లు అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా ఆర్‌బీఐ ఈ అప్పును రాష్ట్ర ప్రభుత్వానికి సమీకరించి ఇచ్చింది. దీంతో బడ్జెట్‌ లోపల, బడ్జెట్‌ బయట చంద్రబాబు ప్రభుత్వం అప్పులు ఏకంగా రూ.3,28,321 కోట్లకు చేరాయి. ఇందులో మంగళవారం చేసిన అప్పుతో కలిపి బడ్జెట్‌ అప్పులు రూ.1,79,264 కోట్లకు, బడ్జెట్‌ బయట అప్పులు రూ.1,49,057 కోట్లకు చేరాయి. 

ఇందులో వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో చేస్తున్న అప్పులు రూ.1,01,670 కోట్లు ఉండగా, రాజధాని పేరుతో తీసుకున్న అప్పు రూ.47,387 కోట్లు. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. కాగా, చంద్రబాబు ప్రభుత్వం నెలకు సగటున రూ.16,416 కోట్లు,  రోజుకు రూ.547 కోట్లు అప్పు చేసినట్లయ్యింది. ఈ అప్పులతో  సూపర్‌ సిక్స్‌తో పాటు ఇతర హామీలు అమలు చేయడం లేదు. అలాగే ఆస్తుల కల్పనకు కూడా వ్యయం చేయడం లేదు. మరి ఇన్ని అప్పులు దేని కోసం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)