Breaking News

ఒక్క ఫోన్‌ చేసినా.. ఇంత అనర్థం జరిగేది కాదు

Published on Sun, 03/16/2025 - 03:21

కాకినాడ రూరల్‌: ‘‘జరిగిన ఘటనను జీర్ణించుకోలేకపోతున్నాం. మా కుటుంబంలో అందరూ విద్యావంతులు. పెదనాన్న కొడుకు చంద్రకిశోర్‌ (37)ఎంబీఏ, ఎంకామ్‌ చదివాడు. చాలా కష్టపడి పైకి వచ్చాడు. 2014లో ఓఎన్జీసీలో ఉద్యోగంలో చేరాడు. ఒకటో తరగతి చదువుతున్న జోషిత్‌(7), యూకేజీ చదువుతున్న నిఖిల్‌(6)ను ఇటీవలే స్కూల్‌ మార్చాడు. ఇబ్బందులు, మానసిక ఒత్తిడి ఉన్నట్టు చెప్పలేదు. ఒక్క ఫోన్‌ కాల్‌ చేసి ఉంటే ఇంత అనర్థం జరిగి ఉండేది కాదు’’ అని కాకినాడలో ఇద్దరు కుమారులను చంపి ఆత్మహత్య చేసుకున్న చంద్రకిశోర్‌ సోదరుడు, తాడేపల్లిగూడెంకు చెందిన వానపల్లి ఆదిశేషు వాపోయారు. 

తాడేపల్లిగూడెంలో శనివారం అంత్యక్రియలు నిర్వహించినట్లు చెప్పారు. చంద్రకు 2017లో రాజమహేంద్రవరానికి చెందిన తనూజతో వివాహమైందని, ఆమె ఎంబీఏ చదివారని తెలిపారు. కాగా, తమ సంస్థలో అసిస్టెంట్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్న చంద్రకిశోర్‌ చాలా మంచి వ్యక్తి అని, ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని, పిల్లలతో పాటు అతడూ చనిపోవడం బాధాకరమని ఓఎన్జీసీ, కాకినాడ హెచ్‌ఆర్‌ హెడ్‌ సునీల్‌కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

కలకలం రేపిన ఘటన.. 
ఇద్దరు కుమారులను కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి వస్త్రం కట్టి నీటి బకెట్‌లో ముంచి ప్రాణం తీసి, ఆపై తానూ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చంద్రకిశోర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. చంద్రకిశోర్‌ కాకినాడ రూరల్‌ వాకలపూడి ఓఎన్జీసీ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. భార్య తనూజ, ఇద్దరు పిల్లలతో కాకినాడ తోట సుబ్బారావు నగర్‌లో ఉంటున్నాడు. 

హోలీ పండగ కోసం ఓఎన్జీసీ కార్యాలయానికి భార్య, పిల్లలను తీసుకెళ్లిన అతడు.. భార్యను అక్కడే ఉంచి బట్టలు కుట్టించేందుకు అంటూ పిల్లలను బయటకు తీసుకొచ్చాడు. కాగా, కాకినాడలో పేరున్న పాఠశాలలో ఇద్దరు పిల్లలను ఏటా  రూ.1.50 లక్షల ఫీజుతో చేర్పించాడు. బాగా చదవడం లేదని తిరిగి తక్కువ ఫీజున్న స్కూల్‌కు మార్పించాడు. పిల్లల చదువుపై అతడ బెంగ పెట్టుకున్నట్టు సూసైడ్‌ నోట్‌ ద్వారా తెలుస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)