Breaking News

ఏపీలో కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన 

Published on Tue, 01/09/2024 - 03:36

సాక్షి, అమరావతి :  రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్‌ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం పర్యటిస్తున్నారు.

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్‌ఎస్‌ఆర్‌–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను సమీక్షించనున్నారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 5.64 లక్షల పేర్లను అనర్హులుగా ఎన్నికల సంఘం తేల్చింది.

అలాగే, రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత కోసం తీసుకున్న చర్యలను జనవరి 10న ఉ.9.30 నుంచి 11 గంటల వరకు స్టేట్‌ పోలీస్‌ నోడల్‌ ఆఫీసర్‌తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం.. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉంటుందని.. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీ­ఐ ఉన్నతాధికారులు సమావేశమవుతారన్నారు. ఆ తర్వాత.. సమావేశ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు 10వ తేదీ సా.4.30కు మీడియా­కు వివరిస్తారని ముఖే‹Ù కుమార్‌ మీనా అన్నారు. 

సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి.. 
ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై విజయవాడలో ఈనెల 9, 10 తేదీల్లో  ఈసీఐ ఉన్నతస్థాయి సమావేశాలు జరగనున్నాయని..  విజయవంతం చేసేందుకు  ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్టీఆర్జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీరావు తెలిపారు.  ఏర్పాట్లను పరిశీలించేందుకు ముఖేష్ కుమార్‌ మీనాతో కలిసి కలెక్టర్‌  ఢిల్లీరావు  విజయవాడ నోవాటెల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌ను 
పరిశీలించారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)