Breaking News

పోలవరంపై మరో కుట్ర.. బాబు మార్క్‌ ‘రహస్య’ రాజకీయం!

Published on Wed, 10/30/2024 - 08:02

సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అప్పులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకముందే చంద్రబాబు ఇప్పటికే భారీ మొత్తంలో అప్పులు తెచ్చారు. మరోవైపు.. పోలవరంపై కూడా చంద్రగ్రహణం పట్టుకుంది. బాబు పాలనలో పోలవరంపై మరో కుట్ర జరిగింది.

పోలవరం ప్రాజెక్టు ఎత్తును కుదించారు. 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్ల ఎత్తుకి కుదింపు జరిగింది. కాగా, పోలవరం ఎత్తు తగ్గించినప్పటికీ కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు కేబినెట్‌లో అభ్యంతరం తెలుపలేదు. అయితే, ఆగస్టు  28వ తేదీన కేంద్ర కేబినెట్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.

పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తును 41.15 మీటర్లకే తగ్గించినా రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపలేదు. ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం గమనార్హం. ప్రాజెక్ట్‌ ఎత్తు కుదింపుతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోనుంది. 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును వైఎస్సార్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రాజెక్ట్‌ ఎత్తు కుదించడంతో 115.4 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోనుంది. పోలవరంపై చంద్రబాబు ప్రభుత్వం మోసపూరిత వైఖరిపై రైతుల్లో ఆందోళన నెలకొంది.

ఇదిలా ఉండగా.. ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు నేడు అప్పులు తేచ్చే ప్రక్రియలో బిజీ అయిపోయారు. తాజాగా చంద్రబాబు.. మరో మూడు వేల కోట్ల అప్పు తెచ్చారు. నిన్న 7.17 శాతం వడ్డీకి  మూడు వేల కోట్లను ఏపీ ప్రభుత్వం అప్పు తెచ్చింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా కూటమి ప్రభుత్వం రుణం సమీకరించింది. ఇక, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాలంలోనే 59వేల కోట్లను చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసింది. మరోవైపు.. కార్పొరేషన్ల ద్వారా మరో ఎనిమిది వేల కోట్లు అప్పులు తీసుకుంది. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండానే చంద్రబాబు ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది.

పోలవరంపై మరో కుట్ర..

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)