Breaking News

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటాయి

Published on Sat, 09/07/2024 - 03:08

రైతులకు, కౌలుదారులకు అండగా నిలుస్తాం. రైతులను ఆదుకునేందుకు కేంద్ర వాటాతో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు రూ.3,400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఢిల్లీ వెళ్లిన తర్వాత రాష్ట్ర పరిస్థితిని ప్రధానికి వివరిస్తా. – కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చౌహాన్‌

కేసరపల్లి(గన్నవరం)/సాక్షి, అమరావతి: వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. కృష్ణాజిల్లా, గన్నవరం మండలంలోని కేసరపల్లి–­సావరగూడెం రోడ్డులో ముంపునకు గురైన వరి పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును కేంద్ర మంత్రికి విన్నవించుకున్నారు. 

వారం రోజులుగా నీట మునిగిపోవడం వల్ల వరిపైరు కుళ్లిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎకరానికి రూ.25 వేల వరకు ఖర్చు చేశామని తెలిపారు. ప్రభుత్వాలు ఆదుకోకపోతే తీవ్రంగా నష్టపోవాల్సిన ఉంటుందని జిల్లాలోని పలు గ్రామాల నుంచి వచ్చిన పసుపు, పత్తి, అరటి, మినుము రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం చౌహన్‌ మాట్లాడుతూ  రైతులకు, కౌలుదారులకు అండగా నిలుస్తామని చెప్పారు. 

రైతులను ఆదుకునేందుకు కేంద్ర వాటాతో కూడిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు రూ.3,400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నాయని తెలిపారు. ఢిల్లీ వెళ్లిన తర్వాత రాష్ట్ర పరిస్థితిని ప్రధానికి వివరిస్తానని చెప్పారు. పసల్‌ బీమా యోజన కింద రైతులకు ఆదుకుంటామని పేర్కొన్నారు. ఎంపీలు, మంత్రులు, కలెక్టర్లు పాల్గొన్నారు. 

ఆయిల్‌ పామ్‌ రంగాన్ని ఆదుకోండి
సంక్షోభంలో ఉన్న ఆయిల్‌ పామ్‌ రంగాన్ని ఆదుకో­వాలని కోరుతూ జాతీయ ఆయిల్‌ ఫార్మర్స్‌ అసో­సియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీవీ­ఎస్‌ఆర్‌ ప్రసాద్, కే.క్రాంతి కుమార్‌ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసి శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. క్రూడ్‌ ఆయిల్‌ ఉత్పత్తులపై తక్షణమే దిగుమతి సుంకాన్ని పునరుద్ధరించాలని, డైనమిక్‌ డ్యూటీ మెకానిజమ్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)