వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో కేంద్రం వెసులుబాటు

Published on Sat, 12/06/2025 - 05:03

సాక్షి, అమరావతి: ఉమీద్‌ పోర్టల్‌లో  వక్ఫ్‌ ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కేంద్రం భారీ ఊరటనిచ్చింది. రిజిస్ట్రేషన్‌ చేయని వారిపై వచ్చే మూడు నెలలు ఎటువంటి జరిమానాలు, కఠిన చర్యలు ఉండబోవని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు హామీ ఇచ్చారు. గడువు సడలింపు తర్వాత కూడా ప్రక్రియ పూర్తి చేయలేని పరిస్థితిలో ముతవల్లీలు వక్ఫ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని మంత్రి సూచించారు.

రిజిస్ట్రేషన్‌కు డిసెంబర్‌ 5తో ముగుస్తున్న 6 నెలల గడువు పొడిగింపునకు ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన విషయాన్ని మంత్రి ప్రస్తావిస్తూ,  అయితే నమోదులో ఏదైనా సమస్యలు ఉంటే వక్ఫ్‌ ట్రైబ్యునల్‌కు మరొక ఆరు నెలల వరకు గడువు ఇవ్వడానికి అధికారం ఉందని చెప్పారు. 

ఇప్పటివరకు ఉమీద్‌ పోర్టల్‌లో ఒక లక్ష 51 వేలకుపైగా వక్ఫ్‌ ఆస్తులు నమోదయ్యాయని మంత్రి వెల్లడించారు. దేశంలో దాదాపు 9 లక్షల ఎకరాలకుపైగా వక్ఫ్‌ ఆస్తులు ఉన్న సంగతి గమనార్హం. అయితే సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్  ప్రక్రియ పూర్తికాని పరిస్థితి నెలకొంది.  

రాష్ట్రంలో పరిస్థితి ఇదీ... 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మొత్తం 4,748 వక్ఫ్‌ ఆస్తులు (రిజిస్టర్డ్‌ ప్రోపర్టీలు), పదివేలకు పైగా అన్‌ రిజిస్టర్డ్‌ ఆస్తులు ఉన్నాయి. ఇప్పటికే వక్ఫ్‌ సంస్థల ముతవల్లీలు, నిర్వాహకుల (మేకర్‌) స్థాయిలో దాదాపుగా అన్ని రిజిస్టర్‌ ఆస్తులు  అప్‌లోడ్‌ చేసినట్టు చెబుతున్నారు. వాటికి చెకర్‌ (వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌) పరిశీలన తర్వాత అప్రూవర్‌ (వక్ఫ్‌బోర్డు సీఈఓ) ఆమోదం తెలపాల్సి ఉంది. 

సర్వర్‌ డౌన్‌ సమస్యతో ఈ ప్రక్రియ పెండింగ్‌లో పడిపోయింది. ఇప్పుడు కేంద్రం ఇచ్చిన మూడు నెలల గడువులో ఈ ప్రక్రియ అంతా ‘ఎటువంటి జరిమానాలు లేకుండా’ పూర్తయ్యే వెసులుబాటు ఉంటుందని వక్ఫ్‌ అధికారులు చెబుతున్నారు. అటు తర్వాత మిగిలిన పదివేలకుపైగా అన్‌ రిజిస్టర్డ్‌ వక్ఫ్‌ ఆస్తులు క్రమంగా ఆన్‌లైన్‌ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.  

Videos

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)