బ్యాంకులకు రఘురామ టోకరా

Published on Wed, 12/24/2025 - 05:26

సాక్షి, అమరావతి: బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన  ఉండి టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌ కను­మూరు రఘురామ కృష్ణరాజు చేసిన మోసాలపై దర్యాప్తు పూర్తి చేయ­డానికి సీబీఐ రంగం సిద్ధం చేస్తోంది.  ఈ మోసాలపై దర్యాప్తు చేయకుండా  కృష్ణరాజు గతంలో ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు తొలగించి, దీనిపై ముందుకు వెళ్లడానికి సీబీఐకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనితో మరో­సారి ప్రస్తుత డిప్యూటీ స్పీ­కర్‌  చేసిన మోసాలు చర్చనీయాంశంగా మా­రా­యి.  

మోసాల చిట్టా బారెడు.. 
» ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ కంపెనీ పేరుతో రఘురామ కృష్ణరాజు వివిధ బ్యాంకుల నుంచి  దాదాపు రూ.1,383 కోట్ల రుణాలను తీసుకున్నారు.  
»   థర్మల్‌ పవర్‌ కంపెనీ ఏర్పాటు పేరుతో తీసుకున్న రుణాలను కంపెనీ అవసరాలకు  వినియోగించకుండా  వాటిని తన వారి ఖాతాల్లోకి తరలించి బ్యాంకుల నెత్తిన చేయిపెట్టారు. 
» పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి ఇండ్‌ భారత్‌ థర్మల్‌ పవర్‌ పేరి­ట తీసుకున్న రూ.826.17 కోట్ల రుణాన్ని పక్క­కు మళ్లించడంతో పాటు తీసుకున్న రుణాలపై వడ్డీ కూడా చెల్లించడం లేదంటూ బ్యాంకు సీబీఐని ఆశ్రయించడంతో రఘు­­రామ మోసా­లు వెలుగులోకి వ­చ్చా­యి. 
» తనఖాగా పెట్టిన భూముల్ని మోస­పూరితంగా అమ్మేసుకోవటం, 95 శాతం బొగ్గు కాలి­పోయిందని చెప్పడం వంటి అక్రమాల నేపథ్యంలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమో­దు చేసి దర్యాప్తు ప్రారంభించింది.  
» 2020 అక్టోబర్‌లో రఘురామకృష్ణరాజుకు చెందిన ఇళ్లు, కంపెనీలు, కార్యాలయాల్లో 11 సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందాలు సోదా­లు నిర్వహించి పలు ఫైళ్లు, హార్డ్‌ డిస్‌్కలను స్వాధీనం చేసుకున్నాయి. సంస్థకు చైర్మన్‌­గా ఉన్న రఘురామతో పాటు ఆయన భార్య, కుమా­ర్తె ఇతర డైరెక్టర్లపై కేసులు నమోదు చేశాయి.

దివాళా ప్రక్రియ షురూ.. 
తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు దివాళా ప్రక్రియకు అనుమతి కోరుతూ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యు­నల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైద­­రా­బాద్‌ బెంచ్‌ని ఆశ్రయించాయి. ఇండ్‌ భార­త్‌ థర్మల్‌ రూ.1,383 కోట్ల రుణాన్ని బ్యాంక్‌లకు చెల్లించాల్సి ఉండగా, చాలాకాలంగా బకాయిలు చెల్లించడం లేదని పేర్కొన్నాయి. 

అయితే  కంపెనీ తనఖా చేసిన ఆస్తుల వి­లువ కేవలం రూ. 872 కోట్లే ఉండటంతో ఈ కంపెనీ దివాళా తీసినట్లుగా పరిగణించి.. దివాళా పరిష్కా­ర ప్రక్రియ చేపట్టాల­ంటూ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. బ్యాంకుల వాదనతో ఏకీభవించిన ఎన్‌సీఎల్‌టీ దివాళా ప్రక్రియకు అనుమతించింది.

ఫెమా నిబంధనల ఉల్లంఘన.. రంగంలోకి ఈడీ 
ఇండ్‌ – భారత్‌ సన్‌ ఎనర్జీ ప్రైవేట్‌ పేరిట విదేశాల నుంచి పెద్ద ఎత్తున నిధులను అక్రమంగా తరలించడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. తన సంస్థ కోసమని రఘురామ 2011లో మారిషస్‌కు చెందిన స్ట్రాటజిక్‌ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ నుంచి రూ. 202 కోట్లు రుణం తీసుకున్నారు. అయితే నిధులు అందిన మరుసటి రోజే రూ. 200 కోట్లను ఇండ్‌ – భారత్‌ ఎనర్జీ లిమిటెడ్‌ (ఉత్కళ్‌)కు తరలించేశారు. 

ఈ వ్య­వ­హారం మొత్తం ఫారెన్‌ ఎక్సే్చంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (ఫెమా) దృష్టిలో పడింది. దా­ంతో విషయాన్ని లోతుగా దర్యాప్తు చేసిన ఫె­మా అధికారులు.. మారిషస్‌ కంపెనీ నుండి ఏపీకి చెందిన కంపెనీ ఇండ్‌ భారత్‌ సన్‌ ఎనర్జీకి రూ.202 కోట్లు అందినట్లు గుర్తించా­రు. అలాగే మరుసటి రోజే ఇండ్‌ భారత్‌ ఎనర్జీ లిమిటెడ్‌కు బదిలీ అయినట్లు కూడా నిర్ధారించుకున్నారు. రఘురామరాజు కంపెనీ ఫె­మా నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రూ.40 కోట్లు పెనాల్టీ విధించింది. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)