Breaking News

త్వరలో ‘కులగణన’ జాబితాలు విడుదల!

Published on Tue, 12/03/2024 - 05:09

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏడాది క్రితం అప్పటి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా చేపట్టిన కులగణన వివరాలను అధికారికంగా ప్రకటించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. విడతల వారీగా ఈ జాబితాలను విడుదల చేసి ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం తుది జాబితాలను అధికారికంగా ప్రకటించాలని నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ పునర్‌వ్యవస్థీకరణపై సోమవారం సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 

గ్రామ, వార్డు సచివాలయాలు, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రి డోలా బాలవీరాంజనేయస్వావిుతోపాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో కులగణన ద్వారా సేకరించిన వివరాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కేటగిరీల వారీగా రెండు, మూడు విడతల్లో విడుదల చేసే విషయంపై అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మొదట ఎస్సీ కేటగిరీ కులాల జాబితాలను విడుదల చేయాలని పేర్కొన్నారు. 

ఇందుకోసం గతంలో కులగణన ద్వారా సేకరించిన ఎస్సీ కేటగిరీ కుటుంబాల వివరాలను వెంటనే సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు అందజేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత నాలుగు వారాల్లోగా సాంఘిక సంక్షేమ అధికారులు ఎస్సీ కేటగిరీలోని కులాల వారీగా జాబితాలను సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. 

వాటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, ఆ తర్వాత తుది జాబితాను అధికారికంగా ప్రకటించాలని సూచించారు. అనంతరం ఇదేవిధంగా ఎస్టీ, బీసీ, ఇతర కేటగిరీల జాబితాలను విడతల వారీగా ప్రకటించేందుకు ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.

పంచాయతీకో సచివాలయం లేనట్టే!
పంచాయతీకి ఒక గ్రామ సచివాలయం ఏర్పాటు ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు అంగీకరించలేదు. సచివాలయాల్లోని కొన్ని కేటగిరీల సిబ్బందిని ఆయా శాఖలకు పూర్తిగా బదిలీ చేసేందుకు సైతం ఆయన నిరాకరించారు. సచివాలయ వ్యవస్థపై ఇంకా మరింత అధ్యయనం చేసి మెరుగైన ప్రతిపాదనలతో నివేదికలు సిద్ధం చేయాలని, మరో నాలుగైదు రోజుల్లోనే మళ్లీ సమీక్ష నిర్వహిస్తామని ఆయన చెప్పినట్లు తెలిసింది. 

సచివాలయం స్థాయిలోనే పంచాయతీ, ఇతర శాఖల ఉద్యోగులు సమన్వయంతో పనిచేసేలా వ్యవస్థ ఉండాలని సీఎం సూచించారు. మరోవైపు ఈ సమావేశంలో గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన ప్రస్తావన కూడా రాలేదు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)