Breaking News

మిస్సింగ్ మిస్టరీ

Published on Sun, 05/25/2025 - 02:57

ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి తియ్యని మాటలకు ప్రే‘మాయ’లో పడిపోయి ఒకరు..వివాహేతర సంబంధంతో పిల్లలను తీసుకొని మరొకరు.. తల్లిదండ్రులు మందలించారని ఇంకొకరు.. ఇలా విశాఖలో వరుసగా మహిళల అదృశ్య సంఘటనలు కలవరం రేపుతున్నాయి.దాదాపుగా ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట మహిళలు మాయమవుతూనే ఉన్నారు. బాలికలనుంచి వివాహితుల వరకు వయోభేదాలు లేకుండా కనిపించకుండా పోతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు.. తిరిగి ఇంటికి చేరకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

వీరి కోసం కుటుంబ సభ్యులు.. సమీప బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటీవల కాలంలో నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మిస్సింగ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. గత ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కేవలం నాలుగు నెలల్లోనే 175 మంది మహిళలు అదృశ్యమైనట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.   

విశాఖ సిటీ: విశాఖ నగరంలో మహిళల అదృశ్యాలకు ప్రధానంగా ప్రేమ వ్యవహారాలు, వివాహేతర సంబంధాలే కారణమని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కనిపించకుండా పోయిన యువతుల్లో ఎక్కువ మంది ప్రేమించుకోవడం, ప్రేమికుడిని దక్కించుకోవడం కోసమే ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది. 

అలాగే మధ్య వయసు్కలైన మహిళలు కూడా వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబాన్ని వదిలి వెళ్తున్నారు. మిస్సింగ్‌ కేసుల్లో సుమారు 75 శాతం వరకు ఈ రెండు కారణాలే ఉన్నాయని పోలీసు రికార్డులు చెబుతున్నాయి. ఇది నగరంలో పెరుగుతున్న ఆందోళనకరమైన ధోరణిగా మారింది. 

175 మంది మాయం 
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మిస్సింగ్‌ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. గత ఐదేళ్లలో ప్రతి ఏటా 50 నుంచి 186 కేసులు వరకు రాగా.. ఈ ఏడాది నాలుగు నెలల్లోనే 175 కేసులు నమోదవడం విశాఖ పరిస్థితికి అద్దం పడుతోంది. జనవరిలో 37, ఫిబ్రవరిలో 49, మార్చిలో 43, ఏప్రిల్‌లో 46 మంది అదృశ్యమయ్యారు.

వీరిలో 133 మంది ఆచూకీని పోలీసులు గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా 42 మంది ఆచూకీ తెలియరాలేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. వీరు ప్రేమ, ఇతర కారణాలతో కావాలనే వెళ్లిపోయారా? లేదా ఏదైనా దురదృష్ట సంఘటన జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది. మిస్సింగ్‌ కేసుల పరిష్కారం కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.  

పోలీసులకు సవాల్‌ 
వీరిని పట్టుకోవడం పోలీసులకు సైతం సవాలుగా మారుతోంది. కొంతమంది ఆచూకీ తెలుసుకున్నప్పటికీ.. మేజర్లు, చట్టాలు, హక్కులు పేరుతో పోలీసులకు కూడా చుక్కులు చూపించిన సంఘటనలు ఉన్నాయి. ఇటువంటి కేసుల్లో అదృశ్యమైన వారి ఆచూకీని పోలీసులు గుర్తించడం మినహా వారిని కుటుంబ సభ్యులకు అప్పగించడం కూడా ఒక పెద్ద సమస్యగా మారుతోంది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)