Breaking News

వారాహి ఆలయ ధ్వంసంపై కేసు నమోదు

Published on Sat, 06/14/2025 - 04:44

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని శ్రీ ఆది వారాహి అమ్మవారి ఆలయం ధ్వంసంపై హిందూ సంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలతో ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడంతో బాధితుల ఫిర్యాదు మేరకు రామిరెడ్డి, మణిరెడ్డి, హేమాద్రితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆ ముగ్గురినీ అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి బెయి­ల్‌ మంజూరు చేశారు. అయితే ప్రధాన నిందితుడైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుడు కిషోర్‌ రెడ్డిపై కేసు నమోదు చేయక పోవడం పట్ల స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా­యి. 

ప్రభుత్వ పెద్దలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి, నామ­మాత్రపు సెక్షన్లతో కేసు పెట్టడం వల్లే ముగ్గురి ఇలా అరెస్ట్‌ చేయడం.. అలా బెయిల్‌ మంజూరు చేసి పంపడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా­రు. ఈ ఘటనలో ఎవరిపై చర్యలు తీసుకోకపో­యి­నా.. తీసుకున్నట్లు కనిపించాలని పై స్థాయి నుంచి ఆదేశాలు వచి్చనట్లు సమాచారం. అందువల్లే తూ­తూ మంత్రపు చర్యలతో పోలీసులు ప్రజలను బురి­డీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ‘నన్నెవరూ ఏ­మీ చేయలేరు. నాని అన్న మంత్రి లోకేశ్‌తో మాట్లాడాడు. వాళ్లేం చేస్తారో చేసుకోని.. మనం చేసేది చేద్దాం’ అని ఆలయం కూల్చివేతలో కీలక నిందితు­డు తన సన్నిహితులతో చెప్పినట్లు తెలిసింది. 

కాగా, ఈ ఘటనపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటంతో ఆలయాన్ని నేలమట్టం చేసిన ప్రాంతాన్ని శుక్రవారం ఉదయం ఎస్‌ఐ జగన్నాథరెడ్డి పరిశీలించారు. కూటమి నాయకుల దాడిలో శిథిలమైన విగ్రహాలు, ఉత్సవమూర్తులను పోలీసు స్టేషన్‌కు తరలించారు. దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఫణిరాజశయన ఆలయ ధ్వంసం ప్రాంతాన్ని సందర్శించి, ఆలయ ఉపచారకులు శ్రీమహారుద్ర వారాహి స్వామిని అడిగి వివరాలను నమోదు చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

కాగా, విజయవాడకు చెందిన జై భారత్‌ హిందూ సంఘానికి చెందిన సభ్యులు ఘటనా స్థలి వద్దకు వచ్చి వి­వరాలు అడిగి తెలుసుకున్నారు. హిందూ ఆలయా­లపై దాడులు జరుగుతున్నప్పటికీ కూటమి ప్రభు­త్వం సరైన చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద ఘటనలో నిందితులకు వెంటనే బెయిల్‌ మంజూరు కావడంపై హిందూ సంఘాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.  

పాకిస్తాన్‌లో ఉన్నామా? 
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి హిందువులపై ఎందుకు ఇంత విద్వేషమని హిందూ సంఘ ప్రతినిధి చీనేపల్లి కిరణ్‌ ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత్‌లోనే ఉన్నామా.. లేక పాకిస్తాన్‌లో ఉన్నామా అని అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్యే నాని అనుచరుడు కిషోర్‌ రెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెబుతున్నా ప్రభుత్వం స్పందించక పోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. 

ఇప్పటి వరకు ఎమ్మెల్యే నాని ధ్వంసమైన ఆలయాన్ని పరిశీలించక పోవడం శోచనీయమన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ సైతం ఈ ఘటనపై స్పందించక పోవడం పట్ల హిందువులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తూతూ మంత్రపు చర్యలతో సరిపెడితే హిందూ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం తప్పదని స్పష్టం చేశారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)