Breaking News

శవమై కనిపించిన శ్రీనివాస్‌: జాడ చెప్పిన దర్శకుడి టాటూ

Published on Thu, 10/30/2025 - 14:24

కోనసీమ జిల్లా: అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన కారు డ్రైవర్‌ కంచిపల్లి శ్రీనివాస్‌ (37) ఘటన విషాదాంతమైంది. గత శనివారం అదృశ్యమైన అతడు బుధవారం పి.గన్నవరం మండలం ఆర్‌.ఏనుగపల్లి గ్రామంలోని వైనతేయ నదీ పాయలో శవమై కనిపించాడు. అతడి సోదరుడు అంజి పుట్టు మచ్చల ఆధారంగా శ్రీనివాస్‌ మృతదేహాన్ని గుర్తించాడు. ఈ కేసును అమలాపురం పట్టణం, పి.గన్నవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్‌ మృతి చెంది దాదాపు ఐదు రోజులు అవుతుందని, పోస్టుమార్టం నివేదిక వస్తేనే మృతికి కారణాలు తెలుస్తాయని పి.గన్నవరం ఎస్సై బి.శివకృష్ణ, అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు.

 ఇదిలా ఉండగా.. శ్రీనివాస్‌ భార్య దేవి, కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్‌కు వచ్చారు. తన భర్త అదృశ్యం కేసు ఎంత వరకూ వచ్చిందని ఆరా తీశారు. ఇదే విషయాన్ని పట్టణ పోలీస్‌ స్టేషన్‌ ముందు విలేకరులకు తెలిపారు. ఆర్‌.ఏనుగపల్లిలో ఓ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారని తెలిసి ఆమె పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. ఆ మృతదేహం తన భర్తదే అని నిర్ధారణ కావడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. గత శనివారం శ్రీనివాస్‌ ఇంట్లో తాను రాజమహేంద్రవరం వెళుతున్నానని చెప్పి స్కూటీపై బయలు దేరాడు. అప్పటి నుంచి అతను తిరిగి రాలేదు.  

దర్శకుడు సుకుమార్‌ టాటూ 
ఆర్‌.ఏనుగపల్లిలో శ్రీనివాస్‌ మృతదేహం లభ్యమైనప్పుడు అక్కడి పోలీసులు అతడి శరీరంపై సినీ దర్శకుడు సుకుమార్‌ చిత్రంతో పాటు పలు పేర్లను టాటూలుగా వేయించుకున్న విషయాన్ని గుర్తించారు. అతడి కుడి చేతిపై దేవి, రిషి, వినీత్‌ అనే పేర్లు ఇంగ్లిషులో ఉన్నాయి. నీలి రంగు ప్యాంట్‌ ఊడిపోయి అతని కాళ్ల వద్ద వేలాడుతోంది. 

నా భర్తను కాసుబాబే చంపాడు 
తన భర్తను పట్టణానికి చెందిన గంగుమళ్ల కాసుబాబు, అతడి అనుచరులు చంపినట్టు తనకు అనుమానంగా ఉందని మృతుడి శ్రీనివాస్‌ భార్య దేవి స్థానిక విలేకర్లకు తెలిపింది. తన భర్తపై కాసుబాబు కక్ష పెంచుకుని ఇదంతా చేశాడని ఆరోపించింది. కాసుబాబుతో పాటు శంకర్, సలాది అప్పన్న, కారు డ్రైవర్‌ కలిపి తన భర్తను చంపారన్న అనుమానం ఉందని తెలిపింది. పట్టణ పోలీసులు ఈ నలుగురి కదలికలపై నిఘా పెట్టారు. తాము కూడా ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు.  

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి