Breaking News

తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజు మూడు ప్రమాదాలు

Published on Tue, 11/04/2025 - 07:07

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఒకే రోజు మూడు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఏపీలోని సత్యసాయి జిల్లాలో ఐచర్‌ వాహనాన్ని ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 8 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రి కి తరలించారు. రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద ఘటన జరిగింది.

నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలం బుగ్గుబావిగూడెం వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కావలి నుంచి హైదరాబాద్ వెళ్తున్నచెర్రీ ట్రావెల్స్ బస్సు నార్కెట్ పల్లి -అద్దంకి హైవే పై ట్రాక్టర్ ను డికొట్టింది. బస్సు వెనుక నుంచి ఢీకొట్టడంతో రోడ్డుపై ట్రాక్టర్ పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదు మందికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 A మంది ప్రయాణికులు ఉన్నారు.

కరీంనగర్ జిల్లా: తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపై వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ క్షతగాత్రులను అంబులెన్స్‌లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మెట్‌పల్లి డిపోకి చెందిన బస్సు.. హైదరాబాద్‌నుంచి మెట్టుపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

 

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)