Breaking News

టీడీపీ నేత అండతో శ్మశానం కబ్జా

Published on Sat, 07/20/2024 - 04:12

తిరుపతి మంగళం: ‘మా తాతముత్తాల నుంచి తిరుపతి తిమ్మినాయుడుపాలెం గ్రామంలో దళితవాడ ఎదురుగా సర్వే నంబర్‌ 199లోని 1.49 ఎకరాల స్థలాన్ని శ్మశానవాటికగా వినియోగించుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా గ్రామంలోని టీడీపీ నాయకుడు వెంకటరత్నం అండతో కొందరు శ్మశాన స్థలాన్ని కబ్జా చేశారు. అక్రమంగా షెడ్లు నిరి్మంచారు. వెంటనే అడ్డుకోండి..’ అని తిమ్మినాయుడుపాలెం గ్రామస్తులు శుక్రవారం తిరుపతి అర్బన్‌ తహసీల్దార్‌ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. 

వందేళ్ల చరిత్ర కలిగిన శ్మశాన స్థలంలోని ఆక్రమణలను తక్షణమే తొలగించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తిమ్మినాయుడుపాలెం ప్రజలు వందేళ్లుగా వినియోగించుకుంటున్న శ్మశాన స్థలంలో ఇటీవల కొందరు టీడీపీ నాయకులతో కలసి ఆక్రమించుకుని అందులో షెడ్లు నిరి్మంచుకున్నారని తెలిపారు. దీంతో తమ గ్రామంలో ఎవరైనా చనిపోతే ఖననం చేయడానికి స్థలం లేక నానా అవస్థలు పడుతున్నామని చెప్పారు.

ప్రస్తుతం ఉన్న శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకున్నవారు కొత్తగా అటవీశాఖ భూమిని శ్మశానం కోసం కేటాయించాలని కోరుతున్నారని తెలిపారు. మరోవైపు ఆక్రమణదారులు మళ్లీ నిర్మాణాలకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కొత్త నిర్మాణాలను అడ్డుకోవడంతోపాటు ఉన్న వాటిని తొలగించి తమ గ్రామానికి శ్మశాన స్థలాన్ని అప్పగించాలని కోరారు.

శ్మశానం కబ్జాకు యత్నం.. తిరగబడిన దళితులు
రాజంపేట: శ్మశానస్థలాన్ని సైతం కబ్జా చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ వర్గీయులపై దళితులు తిరగబడిన ఘటన అన్నమయ్య జిల్లా ములక్కాయపల్లెలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళి­తే..సర్వే నంబరు 1,713లో 0.20 సెంటు భూమి­ని దళితవాడకు శ్మశానస్థలంగా కేటాయిస్తూ గత సంవత్సరం  ప్రభుత్వ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతి పరులుగా ఉన్న కొందరు ఈ స్థలంపై కన్నేశారు.

శుక్రవారం స్థలానికి ముళ్లకంచె వేసి కబ్జాకు యత్నించారు. ఇది తెలుసుకున్న దళితులు మూకుమ్మడిగా స్థలం వద్దకు చేరుకుని టీడీపీ వర్గీయులు వేసుకున్న ముళ్లకంచెను తొలగించారు. దీంతో టీడీపీ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోయారు. దళితులపై బెదిరింపులకు దిగారు. సమాచారం తెలుసుకున్న మన్నూరు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో ప్రస్తుతానికి గొడవ సద్దుమణిగింది. 

అయితే తమ శ్మశానవాటికను కబ్జా చేసేందుకు టీడీపీకి చెందిన కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఇప్పటికే ములక్కాయపల్లె దళితులు రెవెన్యూ అధికారులకు విన్నవించారు. స్థలాన్ని కబ్జా కానివ్వమని, జిల్లా కలెక్టర్‌ దృష్టికి సైతం తీసుకెళ్లి పోరాడుతామని వెల్లడించారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)