Breaking News

75 శాతం ఆస్తులు దానం చేసిన చరిత్ర మాది

Published on Tue, 03/10/2026 - 04:36

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి రెవెన్యూ వ్యవహారాలపై అవగాహన ఇంతేనా అని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రశ్నిం చారు. సోమవారం డోన్‌ నియోజకవర్గంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలకు బుగ్గన స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సభలో ఒక అర్జీదారుడు రెండేళ్లుగా పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని చెప్పిన విషయాన్ని సీఎం రాజకీయంగా మలచడం సరైంది కాదని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. అది ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉన్న వ్యక్తిగత సమస్య కావడంతో అధికారులు దానిని పరిష్కరించలేకపోయారని తెలిపారు. నిజంగా అర్జీదారుకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఉంటే సంబంధిత విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించి నిజ నిర్ధారణ చేయాలని సూచించాలని పేర్కొన్నారు.

ప్రతి విషయాన్ని రాజకీయంగా మార్చడం ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి తగదని వ్యాఖ్యానించారు. తమ కుటుంబానికి, తమ అనుచరులకు ఇతరుల ఆస్తులపై ఎలాంటి ఆశలూ, ఆపేక్ష లేవని స్పష్టం చేశారు. వందేళ్ల క్రితం నుంచి తమ కుటుంబం ఏ ఇంట్లో నివసిస్తుందో ఈ రోజుకీ అదే ఇంట్లో ఉంటున్నామని చెప్పారు. తమ కుటుంబం వద్ద ఉన్న ఆస్తుల్లో 75 శాతం దానం చేసిన చరిత్ర ఉందని బుగ్గన పేర్కొన్నారు. తాము దానం చేసిన ఆస్తులను చూడాలంటే ఒక రోజు సమయం పడుతుందని, సమయం చూసుకుని వస్తే వ్యక్తిగతంగా చూపిస్తానని చెప్పారు.

సభలో ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్డీవో ఆ భూమి అసైన్డ్‌ అని, అర్జీదారుడికి సంబంధం లేదని చెప్పినప్పటికీ ఆ విషయాన్ని బుల్డోజ్‌ చేసి సీఎం ఆరోపణలు గుప్పించారని విమర్శించారు. ఇది తిరుమల లడ్డూ వ్యవహారంలా ఉందని పేర్కొంటూ, అప్పట్లో ఈవో శ్యామలరావు వాస్తవాలు చెప్పినా వాటిని పట్టించుకోలేదని అన్నారు. అనంతరం సీబీఐ సిట్‌ కూడా శ్యామలరావు చెప్పినదే నిజమని తేలి్చందని గుర్తుచేశారు. వయస్సు, పదవికి తగిన విధంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు నాయుడికి బుగ్గన రాజేంద్రనాథ్‌ సూచించారు. అవాస్తవమైన, అన్యాయమైన ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)