Breaking News

బుడమేరు ఎఫెక్ట్‌.. కొల్లేరు కొత్త టెన్షన్‌

Published on Fri, 09/06/2024 - 16:27

సాక్షి, ఏలూరు: ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు, బుడమేరు కారణంగా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. వరదలు విజయవాడ నగరాన్ని ఉక్కిరిబిక్కిరిచేశాయి. పదుల సంఖ్యలో ప్రజలు వరదల్లో చనిపోయారు. మరోవైపు.. తాజాగా బుడమేరు ఉధృతి ఎఫెక్ట్‌తో కొల్లేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో లంక గ్రామాలకు ముంపు భయల నెలకొంది.

కొల్లేరులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో పల్లెల్లోకి నీరు చేరుతోంది. దీంతో, లంక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. మండపల్లి, ఏలూరు, కైకలూరు మండలాల్లో కొల్లేరు వరద ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే మండవల్లి మండలంలో నుచ్చుమిల్లి, ఇంగిలిపాకలంక, పెనుమాక లంక, నందిగామలంక, ఉనికిలి, తక్కెళ్లపాడు, మణుగునూరు, కొవ్వాడలంక గ్రామాలను కొల్లేరు వరద చుట్టేసింది. మరోవైపు.. కోమటిలంక సమీపంలో కొల్లేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

ఇక, చిన్నఎడ్లగాడి వద్ద జాతీయ రహదారిపై కొల్లేరు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో, రాకపోకలు నిలిచిపోయాయి. కొల్లేరు ప్రస్తుత నీటిమట్టం 3.3 మీటర్లుగా ఉంది. ఇప్పటికే పలుచోట్ల ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. నీటిమట్టం 3.5 మీటర్లు దాటితే కొల్లేరులో గ్రామాలు పూర్తిగా మునిగిపోతాయి. ఈ నేపథ్యంలో కొల్లేరు సమీపవాసులు ఆందోళనకు గురవుతున్నారు.

కొల్లేరును ముంచేసిన బుడమేరు వరద నీరు

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)