Breaking News

సుఖీభవ పేరుతో సెట్టింగ్‌ డ్రామా

Published on Sun, 08/03/2025 - 04:37

ఒంగోలు సిటీ: ‘పంజాబీ దాబాలాంటి సెట్టింగ్‌ వేసి.. 50 నుంచి 60 నులక మంచాలపై మహిళలు, రైతులను కూర్చోబెట్టారు. సీఎం చంద్రబాబు వెనుక గడ్డివాము, ఒక ట్రాక్టర్‌ పెట్టి.. చుట్టూ పచ్చగా ఉండేలా భారీ సెట్టింగ్‌ వేసి అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని ఓ డ్రామా తరహాలో నిర్వహించారు’ అని దర్శి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కష్టాల్లో ఉన్న రైతులను పలకరించకుండా అన్నదాతా సుఖీభవ పేరుతో షూటింగ్‌ చేసుకుని వెళ్లిపోయారని మండిపడ్డారు.

శనివారం ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ పరిపాలనలో ఏటా 53.58 లక్షల మంది లబ్ధిదారులకు రైతు భరోసా అందేదని, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్యను భారీగా కుదించారని దుయ్యబట్టారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 46.87 లక్షల మందికి అన్నదాత సుఖీభవ ఇస్తున్నారని, మిగిలిన 7 లక్షల మంది రైతులు ఏమి అన్యాయం చేశారో చెప్పాలని ఆయన నిలదీశారు. మొదటి ఏడాది రైతులకు సాయం ఎగ్గొట్టి, ఇప్పుడు కేంద్రం వాటా కలుపుకుని రూ.7 వేలు ఇవ్వడం దగా చేయడమేనన్నారు. బడ్జెట్‌లో అన్నదాత సుఖీభవకు ఎంత కేటాయించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.  

రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించరు 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి పంటకు క్వింటాల్‌కు రూ.27 వేలు నుంచి రూ.28 వేలు ధర లభిస్తే.. చందరబాబు హయాంలో క్వింటాల్‌ ధర రూ.6 వేలకు పడిపోయిందని శివప్రసాద్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక మిర్చి, పొగాకు, శనగ, వరి, పత్తి ఇలా అన్ని పంటల రైతులు గిట్టుబాటు ధరలు రాక అవస్థలు పడుతున్నారన్నారు.  

దర్శిలో కార్యక్రమం ఎవరి కోసం.. 
సీఎం చంద్రబాబు దర్శిలో నిర్వహించిన కార్య­క్ర­మం ఎవరి కోసమో చెప్పాలని మాజీ మంత్రి, వై­ఎస్సార్‌సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున డిమాండ్‌ చేశారు. మిర్చి రైతుల కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మి­ర్చి యా­ర్డుకు వెళ్లిన తర్వాత సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖరాసి చేతులు దులుపుకున్నారని వి­మర్శించారు. పొదిలికి జగన్‌మోహన్‌రెడ్డి వస్తే వే­లాది మంది రైతులు, కార్యకర్తలు తరలివచ్చారని, వా­రిపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారన్నా­రు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)