Breaking News

యువతి సజీవ దహనం కేసు కీలక మలుపు

Published on Wed, 11/12/2025 - 12:10

పశ్చిమ గోదావరి జిల్లా: తణుకు మండలం ముద్దాపురంలో నిద్రిస్తున్న యువతి సజీవదహన మైన ఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించగా తాజాగా కేసు వ్యవహారం కీలక మలుపు తిరిగినట్లుగా సమాచారం. 2022లో జరిగిన ఈ ఘటనలో ముళ్లపూడి శ్రీను, రూప దంపతుల కుమార్తె నాగహారిక (19) తన గదిలోని మంచంపై సజీవదహనమైంది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మృతిచెంది ఉండవచ్చని అప్పట్లో అనుమానాస్పద మృతిగా రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. 

అయితే నాగహారిక అమ్మమ్మ, మేనమామలు మాత్రం ఇది ఖచ్చితంగా హత్యేనంటూ అప్పట్లో ఆరోపణలు చేయడంతోపాటు పోరాటం చేశారు. ఇటీవల కేసుకు సంబంధించి వచ్చిన ఫోరెన్సిక్‌ రిపోర్టులో కీలకమైన ఆధారాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ముందుగా యువతి తల పగలగొట్టి ఆపై పెట్రోలుపోసి నిప్పంటించి హత్యచేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లుగా సమాచారం. నాగహారిక తాడేపల్లిగూడెంలోని ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతుండగా సెలవులకు ఇంటికి వచ్చి మృతిచెందడం అప్పట్లో సంచలనంగా మారింది.

పోలీసుల అదుపులో నిందితులు?
యువతి సజీవ దహనం ఘటనకు సంబంధించి తాజాగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. ముళ్లపూడి శ్రీనివాస్‌ మొదటి భార్య వసంత 2003లో మృతిచెందగా రూపను రెండవ వివాహం చేసుకున్నారు. మొదటి భార్య కుమార్తె అయిన నాగహారిక విషయంలో అప్పట్లో ఆస్తి వ్యవహారంలో తగాదాలు రావడంతోనే హత్య చేసి ఉంటారనే ఆరోపణలు ఏర్పడ్డాయి. ప్రధానంగా యువతి తండ్రి శ్రీనివాస్‌తోపాటు సవతి తల్లి రూపపై కూడా అప్పట్లోనే పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నది వారినేనని, సూత్రదారులు, పాత్రధారులు కూడా వారేనని అని పలువురు అనుమానిస్తున్నారు.

 

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)