Breaking News

బీటెక్‌ విద్యార్థితో వివాహిత జంప్‌.. మూడు రోజులకే ట్విస్ట్‌!

Published on Wed, 07/23/2025 - 08:59

చిత్తూరు అర్బన్‌: అతడికి 19 ఏళ్లు. ఆమెకు 38 ఏళ్లు. అయినా వాళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సమాజం తమ పెళ్లిని అంగీకరించదని భావించి ఎవరికీ కనిపించనంత దూరానికి వెళ్లిపోదామనుకున్నారు. కానీ.. విధి అడ్డు తగలడంతో చేసేదేమీలేక ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. చిత్తూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో పరిధిలో ఈ ఘటన జరిగింది.

వివరాల ప్రకారం.. చిత్తూరుకు చెందిన యువకుడు(19) ఓ ప్రైవేట్‌ కాలేజీలో బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇదే కళాశాలలో నాన్‌–టీచింగ్‌ స్టాఫ్‌గా మహిళ(38) పనిచేస్తోంది. ఈమెకు వివాహమవ్వగా.. భర్తతో విడిపోయి జీవనం సాగిస్తోంది. రోజూ కాలేజీకి వెళుతున్న విద్యార్థికి, ఆ మహిళతో పరిచయమైంది. అది కాస్తా ప్రేమగా మారింది. వీరిరువురి వయసు తేడా దాదాపు 20 ఏళ్లు ఉండటంతో తమ పెళ్లికి సమాజం ఒప్పుకోదని భావించిన వీరు మూడు రోజుల క్రితం ఎవ్వరూ తమకు అభ్యంతరం చెప్పని ఓ ప్రదేశానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టే వెళ్లిపోయారు.

కానీ, ఇంతలో తమ కుమారుడు మూడు రోజులుగా కనిపించడంలేదని యువకుడి తల్లిదండ్రులు చిత్తూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా.. వీరి ప్రేమ విషయం బయటపడింది. సాంకేతిక ఆధారంగా వీరు బెంగళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించి.. అక్కడి నుంచి ఇరువురినీ చిత్తూరుకు తీసుకువచ్చి తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేశారు. సీఐ నెట్టికంటయ్య కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులతో యువకుడిని ఇంటికి పంపించారు. ఆ మహిళ కూడా తన ఇంటికి వెళ్లిపోయింది.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)