Breaking News

మద్యం కోసం కన్నతల్లినే కడతేర్చాడు

Published on Sat, 09/13/2025 - 09:39

నాతవరం(అనకాపల్లి జిల్లా): మద్యం కోసం కన్నతల్లినే కడతేర్చాడు. మండలంలో వైబీ పట్నంలో మద్యం మత్తులో తల్లిని చంపిన ఘటన సంచలనంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిటికిల జోగునాయుడు, మంగ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహం కాగా కొడుకు రామ్మూర్తినాయుడు మాకవరపాలెం మండలానికి చెందిన అమ్మాయిని çప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో కుమారుడు వ్యసనాలకు బానిసై మద్యం తాగడానికి డబ్బులివ్వాలంటూ ఇంట్లో తరచూ గొడవ పడేవాడు. భర్త వే«ధింపులు భరించలేక భార్య దేవి నాతవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తల్లిదండ్రులు కూడా పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రామ్మూర్తినాయుడు హైదరాబాద్‌ వెళ్లిపోయాడు.  గురువారం మరిడమ్మతల్లి పండగ కావడంతో గ్రామానికి వచ్చాడు. రాత్రి ఒంటి గంట వరకు మద్యం తాగి వైబీ పట్నంలోని తన ఇంటికి వచ్చాడు. మళ్లీ డబ్బుల కోసం తండ్రితో గొడవపడ్డాడు. మద్యం మత్తులో ఉన్న కొడుకు పరిస్థితి గమనించిన ఆయన అక్కడి నుంచి తప్పించుకోగా, నిద్రిస్తున్న తల్లి మంగను కొట్టి డబ్బులడిగాడు. మంచం పైనుంచి కింద పడేసి పక్కనే ఉన్న పూల కుండీతో తలపై బలంగా కొట్టాడు. 

దీంతో తల్లి స్పృహ తప్పి అపస్మార స్థితికి చేరుకుంది. ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, శతమానం లాక్కుని పారిపోయాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి చూసేసరికి మంగ మరణించింది. మృతురాలి భర్త జోగునాయుడి ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించారు. నిందితుడిని అదుపులోని తీసుకున్నామని, దర్యాప్తు అనంతరం అరెస్ట్‌ చేయనున్నట్లు నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)