Breaking News

ఆంధ్రప్రదేశ్‌లో పథకాలు భేష్‌! 

Published on Fri, 01/20/2023 - 02:32

నందిగామ: ఆంధ్రప్రదేశ్‌లో పేదవారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అమలు చేస్తున్న పథకాలు చాలా బాగున్నాయని బ్రెజిల్‌కు చెందిన సోషల్‌ సర్వీస్‌ బృందం ప్రతినిధి మలీష చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి పరిస్థితి, వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలు, గ్రామీణ ప్రాంతాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బ్రెజిల్‌కు చెందిన ఈ బృందం గురువారం ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం మాగల్లు గ్రామానికి వచ్చింది.

మలీష తదితరులు సహాయకుడు జయరాజు, కేడీసీసీబీ డైరెక్టర్‌ కొమ్మినేని రవిశంకర్‌తో కలిసి గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు, గ్రామ సచివాలయం, గ్రామీణ బ్యాంకులు, జగనన్న లేఅవుట్‌లో నిర్మిస్తున్న ఇళ్లు, ,గ్రామంలో ప్రజలు నివసిస్తున్న తీరు, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి పరిస్థితులపై అధ్యయనం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బ్రెజిల్‌లో ఉచితంగా స్థలం ఇచ్చి, ఇల్లు కట్టించే పద్ధతి లేదని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా ఇల్లు కట్టించి ఇవ్వడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఉన్నాయన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల్లోనే అన్ని ప్రభుత్వ సేవలు అందడం అభినందనీయమన్నారు. పేదవారి అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అడిగి తెలుసుకొని అభినందించారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)