Breaking News

కమనీయం.. గణనాథుని కల్యాణం

Published on Wed, 09/27/2023 - 04:08

యాదమరి (చిత్తూరు జిల్లా): స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్స­వాల్లో భాగంగా మంగళవారం స్వామి­వా­రి తిరుకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. వేకువజామున మూలాస్థానంలోని స్వయంభు వినాయకునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ ఉభయదా­రుల ఆధ్వర్యంలో మూలమూర్తికి అభిషేకాలు చేపట్టారు. సాయంత్రం అలంకార మండపంలో పచ్చటి తోరణాలు, అరటి చెట్ల మధ్య బ్రహ్మ మానస పుత్రికలైన సిద్ధి, బుద్ధిలతో స్వామివారి కల్యాణాన్ని ఆలయ అర్చక వేదపండితులు సోమశేఖర్‌ స్వామి, సుబ్బారావు నిర్వహించారు.

అనంతరం ఉభయదారులు, ఆలయ అధికారులు నూతన వధూవరులను పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ చైర్మన్‌ మోహన్‌ రెడ్డి, ఈవో వెంకటే­శు, సర్పంచ్‌ శాంతిసాగర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, మంగళవారం రాత్రి సిద్ధి, బుద్ధి, వినాయక స్వామివారు అశ్వవాహనంపై గ్రామ వీధుల్లో ఊరేగారు.  

నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు: వినాయక స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు బుధవారం రాత్రి ధ్వజావరోహణతో ముగియనున్నాయి. గురువారం ఉదయం నుంచి స్వామివారి ప్రత్యేక ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం  కానున్నాయి. గురువారం నుంచి అక్టోబర్‌ 8 వరకు సిద్ధి, బుద్ధి సమేతంగా  వినాయక స్వామి పలు వాహనాలపై ఊరేగనున్నారు.
 

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)