Breaking News

వెంకటేశ్వర చూస్తున్నావా..?

Published on Sun, 01/12/2025 - 12:52

తిరుపతి,సాక్షి: తిరుపతి తొక్కిసలాటలో (tirupati stampede) మరణించిన బాధితుల కుటుంబాల పట్ల టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు (br naidu) అత్యంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారికి అందించే నష్టపరిహారంలో ఒంటెద్దు పోకడను ప్రదర్శిస్తున్నారు.  

తిరుమల తొక్కిస లాట బాధిత కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం టీటీడీ డబ్బులతో నష్టపరిహారం చెల్లిస్తోంది. అయితే ఈ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు బీఆర్‌ నాయుడు ఏ ఒక్క బాధిత కుటుంబానికి వెళ్లలేదు. వారిని పరామర్శించడం లేదు. టీటీడీ సభ్యులు, టీడీపీ నేతల ద్వారా పరిహారం పంపిణీ చేస్తూ  చేతులు దులుపుకుంటున్నారు.

తిరుపతి మహా విషాదంపై డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ.. మృతి చెందిన బాధిత కుటుంబాలకు టీటీడీ పాలక మండలి స్వయంగా క్షమాపణ చెప్పాలని  వ్యాఖ్యానించారు. అయితే, పవన్‌ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బీఆర్‌ నాయుడు లెక్క చేయడం లేదు. విశాఖలో హోంమంత్రి అనిత, టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా పరిహారం అందించి మమ అనిపిస్తున్నారు.   

పైగా, ప్రభుత్వం  తరుఫు నుంచి కాకుండా టీటీడీ డబ్బులతోనే మృతుల కుటుంబాలకు  చంద్రబాబు ప్రభుత్వం ఈ ఎక్స్‌ గ్రేషియా  చెల్లిస్తోంది. పరిహారం విషయంలో చంద్రబాబు, బీఆర్‌ నాయుడిపై శ్రీవారి భక్తులు మండిపడుతున్నారు. 

పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?

క్షమాపణలు చెప్పితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా?.. ఎవరో ఏదో చెప్పారని మేం స్పందించాల్సిన అవసరం లేదంటూ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు కౌంటర్‌ ఇచ్చారు.

తొక్కి­సలాట ఘటనకు టీటీడీ ఈ­వో శ్యామల­రావు, అదనపు ఈవో వెంకయ్యచౌదరి, టీటీడీ చైర్మన్‌ బాధ్యత వహించాలని పవన్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.. మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు, పోలీసులు క్షమా­పణ చెప్పా­లన్నారు. తొక్కిసలాట జరుగుతుంటే పోలీసు­లు చోద్యం చూసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పోలీసుల వైఫల్యంపైనే ఎక్కువ ఫిర్యా­దులు వస్తున్నాయ­న్నారు. క్రౌడ్‌ మేనేజ్‌మెంట్‌ సరిగా జరగలేదన్నారు.

మరోవైపు, టీటీడీ పాలకమండలి, ఈవో మధ్య వార్ కొనసాగుతోంది. అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. పాలకమండలి సభ్యులకు కనీస సమాచారం ఇవ్వడం లేదంటూ ఈవోపై సభ్యులు మండినట్లు సమాచారం.

👉చదవండి :  చింతించడం తప్ప చేసేదేమీ లేదు

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)