Breaking News

అమ్మా.. నేనూ బడికి పోతా! 

Published on Fri, 02/10/2023 - 09:41

సాక్షి, హిందూపురం: ‘అమ్మా... నేనూ బడికి పోతానమ్మా.. నాన్నకు చెప్పు.. నన్ను బడికి పిలుచుకెళ్లమని’ అంటూ ప్రాధేయపడుతున్న ఆ బాలుడి మాటలు విన్న కన్నతల్లికి కంట నీరు ఆగలేదు. అందరిలా తాను కూడా ఆడుకోవాలని, చదువుకోవాలనే అభిలాషను వ్యక్తం చేస్తున్న కుమారుడిని చూస్తూ నిరుపేద తల్లిదండ్రులు అసహాయ స్థితిలో మౌనంగా రోదిస్తున్నారు.   

ఏం జరిగింది?..  
హిందూపురంలోని మేళాపురం ప్రాంతానికి చెందిన షేక్‌ రఫీక్, నూర్జహాన్‌ దంపతుల ఏకైక కుమారుడు హర్షాద్‌ ఏడో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం ఇంటిపైన కోతులు చేరుకుని అపరిశుభ్రం చేస్తున్నాయంటూ వాటిని అదిలించేందుకు కర్ర తీసుకుని మిద్దెపైకి హర్షాద్‌ వెళ్లాడు. ఆ సమయంలో కోతులను అదలిస్తూ ఇంటి పైభాగంలో వెళుతున్న హైటెన్షన్‌ (33కేవీ) విద్యుత్‌ వైర్ల ప్రభావం కారణంగా షాక్‌కు గురయ్యాడు. దీంతో మెడ నుంచి కుడి వైపు శరీరం మొత్తం కాలిపోయింది.  

ఉన్నదంతా అమ్మి.. 
లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రఫీక్‌ పెద్ద ఆస్తి పరుడేమీ కాదు. వృత్తిలో భాగంగా వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అడపాదడపా కొంత మొత్తం పొదుపు చేసుకున్నాడు. ఈ క్రమంలో విద్యుత్‌షాక్‌కు గురైన కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. వైద్య చికిత్సకు పొదుపు చేసుకున్న డబ్బుతో పాటు ఉన్న కొద్దిపాటి బంగారు నగలూ కర్పూరంలా కరిగిపోయాయి.

దాదాపు రూ. 5లక్షలకు పైగా ఖర్చు పెట్టి కుమారుడి ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే మెడ నుంచి నడుము వరకూ కుడివైపు శరీరం పూర్తిగా కాలిపోయి ముడతలు పడింది. కుడి చేతిలోని నాలుగు వేళ్లూ తొలగించారు. శరీరంలో నీటి శాతం తగ్గింది. గొంతు వద్ద నరాలు గట్టిపడ్డాయి. శరీరంలో రక్తప్రసరణతో పాటు నరాల వ్యవస్థ మెరుగు పడాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని వైద్యులు తెలిపారు.

ఇందు కోసం రూ. 30 లక్షల వరకూ ఖర్చు వస్తుందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఇప్పటికే వారానికి ఒకసారి బెంగళూరుకు చికిత్స కోసం వెళ్లి వచ్చేందుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ ఖర్చు వస్తోంది. ఈ క్రమంలో శస్త్రచికిత్సకు పెద్ద మొత్తం సమకూర్చుకోవడం తమకు తలకు మించిన భారమవుతోందని, ఎవరైనా మానవతావాదులు స్పందించి తమ బిడ్డను మామూలు మనిషిని చేయాలని వేడుకుంటున్నారు.   

దాతలు సాయం చేయదలిస్తే...  
పేరు: షేక్‌ మహమ్మద్‌ రఫీక్‌  
బ్యాంక్‌ పేరు: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 
ఖాతా నంబర్‌ : 3878 101 6511 
ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ : టఆఐN 0004696 
ఫోన్‌ పే నంబర్‌ : 76709 34214   

(చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం)

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)