Breaking News

‘ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం’

Published on Sun, 02/23/2025 - 06:09

సాక్షి, విశాఖపట్నం: గ్రూపు–2 పరీక్ష గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఒకవైపు పరీక్ష వాయిదా వేయిస్తున్నా­మని చెప్పి.. మరో వైపు తమ చేతుల్లో లేదని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శన­మన్నారు. ‘అభ్య­ర్థుల అభ్యంతరాలను పరిగణన­లోకి తీసుకుంటున్నట్టు విద్యా శాఖ మంత్రి లోకేశ్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. తాము వాయిదా వేయ­మనే చెప్పామంటూ సీఎం పేరుతో సర్క్యూలేట్‌ అవుతున్న ఆడియోను ప్రజలంతా విన్నారు. గ్రూప్‌–2 పరీక్ష వాయిదా అంటూ వార్తలు వేసిన ఛానెళ్ల మీద కేసులు పెట్టారు.

ఇంత అయో­­మయం, గందరగోళం ఉన్న ప్రభు­త్వాన్ని నేనెప్పుడూ చూడలేదు. చివరి­దాకా వాయిదా వేస్తున్నామని నమ్మించి ఈ ప్రభుత్వం గ్రూప్‌–2 అభ్యర్థులను మోసం చేసింది. ప్రభుత్వ వైఖరిని, ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసుల లాఠీఛార్జీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంతటి గందరగోళం మధ్య పరీక్ష నిర్వహణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. సీఎం వెంటనే దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించి పరీక్ష వాయిదా వేయాలి. అభ్యర్థుల ఆందోళనపై స్పష్టతనిచ్చిన తర్వాత పరీక్ష నిర్వహించాలి’ అని పేర్కొన్నారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)