ఫైళ్లు తగలబెడుతున్నారంటూ దుష్ప్రచారం

Published on Tue, 08/27/2024 - 04:24

గాంధీనగర్‌(విజయవాడ సెంట్రల్‌): మదనపల్లె ఘటన తర్వాత ఉద్యోగులను వేధిస్తున్నారని, దీనిపై వాస్తవాలు ఇంకా నిర్ధారణ కాలేదని, ఉద్దేశపూర్వకంగా జరిగిందా? ప్రమాదమా? అనేది తేల్చలేదని ఏపీ రెవెన్యూ సరీ్వసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. దీనిపై నేటికీ సీఐడీ విచారణ కొనసాగుతోందని... ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదన్నారు. ఈ ఘటనలో ఉద్యోగులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ‘మదనపల్లె సబ్‌ కలె­క్టర్‌ కార్యాలయంలో అగ్ని ప్రమా­దం ఘటనలో వాస్త­వా­లు ఇంకా ని­రా­్ధరణ కా­లేదు.

ఏ ప్రభుత్వ కా­ర్యాలయంలోనైనా పనికిరాని కా­గి­తాలను తీసి­వేస్తే.. వెంటనే ఉద్దేశపూ­ర్వకంగా ఫైళ్లు తగల­పె­డుతున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. దీని­వల్ల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతోంది. వాస్తవా­ల­ను నిర్ధారించుకున్న తర్వాతే మీడియా ప్రసారం చేయా­లి’ అని వ్యాఖ్యానించారు. సోమవారం విజయ­వాడలో ఆయన మీడి­యాతో మాట్లాడారు.‘ప్రభుత్వ కార్యా­ల­యా­ల్లో ఉద్యో­గు­లకు పనిచేసే వాతావరణం కల్పించా­ల్సిన బాధ్యత ప్రభుత్వా­నిదే.

తహసీల్దార్‌ కార్యా­లయా­ల్లో రోజువారీ ఖర్చులకు కూడా నిధుల్లేవు. ప్రభు­త్వం ఆదే­శాలిస్తుంది గానీ నిధులివ్వ­ట్లేదు’ అని అన్నారు. ‘ప్రస్తు­తం తహశీల్దార్‌ కార్యాల­యా­­ల్లో అద్దె వాహనాలకు కూడా నిధులు లేవు. కంప్యూ­టర్లు, ప్రింటర్లు, ఇంటర్‌నెట్‌ కనెక్టి­విటీ తదిత­రాలకు నిధు­లివ్వ­కపో­వడంతో.. సిబ్బంది జీతాల నుంచే ఖర్చు పెడుతు­న్నా­రు’ అని పేర్కొన్నారు. కాగా, ఏపీఆర్‌ఎస్‌ఏ ప్రధాన కార్య­దర్శిగా రామి­శెట్టి వెంకట రాజేశ్‌ను ఎన్నుకు­న్నట్లు చెప్పారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)