Breaking News

విజయవాడ రైల్వే స్టేషన్‌కు బాంబు బూచి

Published on Sat, 05/24/2025 - 14:47

సాక్షి, ఎన్టీఆర్‌ జిల్లా: ఏపీని వరుస బాంబు బెదిరింపులు హడలెత్తించాయి. విజయవాడ రైల్వే స్టేషన్‌కు శనివారం బాంబు బెదిరింపు కాల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీలను, ప్లాట్‌ఫారమ్‌లను క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఎలాంటి బాంబు లేదని నిర్ధారించుకున్నారు.

విజయవాడ రైల్వే స్టేషన్‌లో(Vijayawada Railway Station) బాంబు పెట్టామని కంట్రోల్ రూమ్ కి కాల్ చేసిన అగంతకుడు.. తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నట్లు అధికారులు వెల్డించారు. ఆ కాల్‌ మహారాష్ట్ర లాతూర్‌ నుంచి వచ్చిందని, ఆగంతకుడు హిందీలో మాట్లాడాడని తెలిపారు. జీఆర్‌పీ, సీఎస్‌డబ్ల్యూ, బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు జరిపారు. ఎల్‌టీటీ రైలు నుంచి కాల్‌ వచ్చినట్లు గుర్తించాం. ఎవరు కాల్‌ చేశారో విచారణ చేస్తున్నాం అని ఆర్‌పీఎఫ్‌ ఏఎస్పీ వెల్లడించారు. 

అంతకు ముందు.. నగరంలోని బీసెంట్ రోడ్‌కు (Besant Road) బాంబ్ బెదిరింపు కాల్ వచ్చింది. కంట్రోల్ రూంకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి బాంబ్ ఉన్నట్లు బెదిరించాడు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ బీసెంట్ రోడ్‌లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. బీసెంట్‌ రోడ్‌లోని షాపులు, తోపుడు బండ్లను బాంబ్‌ స్క్వాడ్ తనిఖీలు చేసింది. అయితే ఎక్కడా బాంబ్ ఉన్న ఆనవాళ్లు లేక పోవడంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

విశాఖపట్నం: ఇటు వైజాగ్‌ రైల్వే స్టేషన్‌లోనూ ‘బాంబు’ అలజడి రేగింది. ఎల్టీఐ ఎక్స్‌ప్రెస్‌(లోకమాన్య తిలక్ టెర్మినస్-విశాఖ)లో బాంబు పెట్టినట్లు ఓ ఆగంతకుడు కాల్‌చేయడంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. రైలు స్టేషన్‌కు చేరుకోగానే బాంబు స్క్వాడ్‌ తనిఖీలు జరిపింది.  ఎస్‌ 2 కోచ్‌లో అనుమానాస్పద బ్యాగ్‌ గుర్తించింది. అయితే అందులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)