Breaking News

ప్రపంచ గుర్తింపు సముద్రంపాలు

Published on Mon, 03/03/2025 - 08:51

సాక్షి, విశాఖపట్నం: రుషికొండ బీచ్‌(Rushikonda Beach).. ప్రపంచ బీ­చ్‌గా మారిందన్న ఆనందం ఆవిరైపోయింది. చంద్రబాబు సర్కారు(Chandrababu govt) నిర్లక్ష్యం కారణంగా ఏపీలో మొట్ట­మొదటి బ్లూ ఫ్లాగ్‌(Blue Flag) బీచ్‌ గుర్తింపు రద్దయింది. గత ప్రభుత్వ హయాంలో నాలుగేళ్ల పాటు బ్లూ ఫ్లాగ్‌ రెపరెపలాడింది. ప్రపంచ పర్యాటకులతో కళకళలాడింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాకుండానే నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆ జెండా పీకేయాల్సి వచ్చింది.

బ్లూ ఫ్లాగ్‌కు అవసరమైన సౌకర్యాల్ని కొనసాగించడంలో విఫలమైనందున ఆ గుర్తింపు రద్దు చేస్తున్నట్లు డెన్మార్క్‌ సంస్థ ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) ప్రకటించింది. పర్యావరణ హిత, ప్రమాద రహిత బీచ్‌లకు అందించే బ్లూ ఫ్లాగ్‌ సర్టీఫికెట్‌ను ఈ బీచ్‌ 2020 అక్టోబర్‌ 11న దక్కించుకుంది. మూడు దశాబ్దాల తర్వాత 2019–20లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 13 బీచ్‌లు ఈ సర్టీఫికేషన్‌ కోసం పోటీ పడితే ఎనిమిది బీచ్‌లకు బ్లూ ఫాగ్‌ దక్కింది. ఇందులో రుషికొండ బీచ్‌ ఒకటి.  

అప్పట్లో ఏం చేశారంటే..? 
బ్లూ ఫ్లాగ్‌ కోసం రుషికొండ బీచ్‌ అభివృద్ధికి రూ.7.35 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. వీటితో వివిధ పనులు చేపట్టారు. ఈ సర్టిఫికెట్‌ కోసం నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందుకనుగుణంగా రుషికొండను అభివృద్ధి చేశారు. నీటి నాణ్యత, భద్రత, బీచ్, వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ మొదలైన అంశాల్లో రుషికొండ బీచ్‌ను పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు. బీచ్‌లో 600 చదరపు మీటర్ల మేర బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌గా అభివృద్ధి చేశారు.

ఈ పరిధిలో ఎక్కడా మలినాలు, వ్యర్థాలు కనిపించకుండా చర్యలు తీసుకున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం బీచ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. వాచ్‌ టవర్లు, స్నానపు గదులు, దుస్తులు మార్చుకునే గదులు, టాయిలెట్లు, మంచినీటి ప్లాంట్, వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌.. ఇలా ప్రతీది వెదురు సామగ్రితో నిర్మించింది. బీచ్‌ నిర్వహణకు అవసరమైన కరెంట్‌ కోసం సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. 40 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌ నుంచి 35 కేవీ విద్యుత్‌ ఉత్పత్తి అవుతోంది. బీచ్‌లో ఏర్పాటు చేసిన 70 ఎల్‌ఈడీ విద్యుత్‌ బల్బులకు సోలార్‌ పవర్‌నే వాడేలా తీర్చిదిద్దారు.  

నాలుగేళ్ల పాటు కంటికి రెప్పలా.. 
ప్రతి సంవత్సరం జ్యూరీ పరిశీలించి ధ్రువీకరణ పత్రాన్ని రెన్యువల్‌ చేస్తారు. 2021, 22లో ఏపీటీడీసీ బీచ్‌ నిర్వహణ పనులు చేపట్టింది. పలు లోపాలు తలెత్తడంతో.. 2023 నుంచి ప్రైవేట్‌ సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి బీచ్‌ మరింత సుందరంగా మారింది. ఏటా జ్యూరీ బృందం బీచ్‌కి వచ్చి.. ప్రతి అంశాన్ని పరిశీలించి.. నివేదిక సిద్ధం చేసేది. 33 అంశాల్లో ఏ ఒక్కటి తేడా ఉన్నా, సర్టిఫికేషన్‌ను రెన్యువల్‌ చేయరు. అలా ప్రతి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడంతో నాలుగేళ్ల పాటు బ్లూ ఫ్లాగ్‌ రెపరెపలాడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. బ్లూఫ్లాగ్‌ బీచ్‌ కాస్తా బ్లూ ఫ్రాడ్‌గా మారిపోయింది.

ఏపీటీడీసీ అధికారులు, కూటమి నేతలు కలిసి.. ప్రైవేట్‌ సంస్థతో కుమ్మక్కై నిర్వహణ కోసం కేటాయించిన సొమ్మును అందిన కాడికి దోచుకున్నారు. దీంతో బీచ్‌ కళావిహీనంగా మారిపోయింది. కనీస వసతులు కరువయ్యాయి. ఇటీవల పరిశీలనకు వచ్చిన ఎఫ్‌ఈఈ జ్యూరీ బీచ్‌ పరిస్థితుల్ని చూసి అవాక్కయింది. దీంతో.. బీచ్‌ గుర్తింపును ఫిబ్రవరి 13న రద్దు చేస్తున్నట్లు ఏపీటీడీసీకి సమాచారం ఇచ్చారు. కొద్ది నెలల సమయంలో మరోసారి పరిశీలనకు వస్తామని.. ఆలోపు పరిస్థితులు మారకుంటే శాశ్వతంగా గుర్తింపు రద్దు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా తొక్కిపెట్టింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)