Breaking News

పార్టీ ఆఫీస్‌ ఎదుటే.. బీజేపీ మహిళా నాయకురాలి ఆత్మహత్యాయత్నం

Published on Wed, 10/18/2023 - 19:39

సాక్షి, విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి తీరుకు నిరసనగా మహిళ నాయకురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన అంజనా చౌదరి.. పార్టీలో వేధింపులు తాళలేక బీజేపీ కార్యాలయం ఎదుటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. మహిళా నాయకురాలిని వేధించిన పార్టీ నాయకుడికి అందలమెక్కించిన పురందేశ్వరి తీరుపై మనస్తాపంతోనే ఈ పాల్పడినట్లు తెలుస్తోంది. 

ఈ సందర్భంగా మహిళా నాయకురాలు అంజనా చౌదరి తన మనుసులోని ఆవేదనను బయటకు చెప్పుకుంది. ప్రభుత్వ ఉద్యోగం వదులుకుని మరీ రాజకీయాలలోకి వచ్చినట్లు చెప్పింది. 26వ వార్డు మున్సిపల్ చైర్ పర్సన్ విషయంలో వివాదం జరిగిందని.. అప్పటి నుంచి ప్రశాంత్ అనే వ్యక్తి తనను టార్గెట్ చేసినట్లు పేర్కొంది. బీజేపీ వర్క్ షాప్ జరిగినపుడు వాష్ రూమ్‌కు వెళ్లి వచ్చేటప్పుడు వీడియోలు తీసి వైరల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ విషయాన్ని అప్పటి అధ్యక్షుడు సోము వీర్రాజు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన ప్రశాంత్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పురందేశ్వరి అధ్యక్షురాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్లకు పదవులు ఇచ్చి, తనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. పార్టీలో అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వాపోయారు. తన చావుకు కారణం రాజంపేట బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులతో పాటు నాగోతు రమేష్ నాయుడు, ప్రశాంత్ అని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షురాలు మహిళ అయినా ఒక మహిళగా తనకు అన్యాయం జరిగిందంటూ కన్నీరు పెట్టుకున్నారు.
చదవండి: బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌పై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)