Breaking News

విశాఖ వాసికి బిల్‌ గేట్స్‌ ప్రశంస

Published on Sun, 03/23/2025 - 17:31

అక్కిరెడ్డిపాలెం:  అప్పుడే పుట్టిన శిశువుల్లో వచ్చే పచ్చకామెర్ల నివారణకు వినియోగించే ఎనలైట్‌–360 పరికరాన్ని గేట్స్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బిల్‌ గేట్స్‌ పరిశీలించారు. అక్కిరెడ్డిపాలేనికి చెందిన ఎం.సుబ్రహ్మణ్యప్రసాద్‌ ఈ పరికరాన్ని తయారు చేశారు. 

దీనిని దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో ప్రదర్శించగా.. బిల్‌గేట్స్‌ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. పరికరం తయారుచేసిన ప్రసాద్‌ను అభినందించారు. ఈ పరికరం తయారీతో నూతన ఆవిష్కరణలకు అందించే ప్రతిష్టాత్మక ఆరోహణ్‌ సోషల్‌ ఇన్నోవేషన్‌ అవార్డు 2023ను ప్రసాద్‌ ఇప్పటికే సాధించారు.   

ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న బిల్‌ గేట్స్‌..  పోలియో నిర్మూలన, హెచ్ఐవీ నివారణ, క్షయ నిర్మూలన వంటి వాటికోసం భారతదేశం చేపట్టిన ప్రధాన ఆరోగ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. భారత్‌ కు వచ్చే ముందు బిల్‌ గేట్స్‌ ప్రశంసలు కురిపించారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, డిజిటల్ పరివర్తనలో భారత్ పురోగతి అనన్య సామాన్యమని బిల్ గేట్స్ అన్నారు. గేట్స్ ఫౌండేషన్ భారతదేశంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తోందని, కీలక రంగాలలో పురోగతిని సాధించడానికి ప్రభుత్వం, పరిశోధకులు, వ్యవస్థాపకులతో కలిసి పనిచేస్తుందని బిల్ గేట్స్ హైలైట్ చేశారు. గేట్స్ ఫౌండేషన్ 25వ వార్షికోత్సవం సందర్భంగా.. ట్రస్టీల బోర్డు మొదటిసారి గ్లోబల్ సౌత్‌లో సమావేశమవుతోంది. ఈ కార్యక్రమానికి భారత్ అనువైన ప్రదేశం అని ఆయన అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)