Breaking News

ప్రివిలేజెస్‌ కమిటీ చైర్మన్‌గా భూమన 

Published on Tue, 07/18/2023 - 05:20

సాక్షి, అమరావతి: అసెంబ్లీ ప్రివిలేజెస్‌ కమిటీ చైర్మన్‌గా  ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. పలు అసెంబ్లీ కమిటీలు, జాయింట్‌ కమిటీలను ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి సోమ­వారం రెండు బులెటిన్లు విడుదల చేశారు. ప్రివిలేజెస్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రివర్గంలో చేరడంతో ఆయన స్థానంలో కరుణాకర్‌రెడ్డిని నియమించారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, కోన రఘుపతి,  అబ్బయ్యచౌదరి,  సుధాకర్‌బాబు, వెంకట చినఅప్పలనాయుడు, అనగాని సత్యప్రసాద్‌ను నియమించారు.

రూల్స్‌ కమిటీ చైర్మన్‌గా స్పీకర్‌ తమ్మినేని సీతారాం, పిటిషన్స్‌ కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, హామీల కమిటీ చైర్మన్‌గా కైలే అనిల్‌కుమార్, ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌గా శిల్పా చక్రపాణిరెడ్డిని నియమించారు.  అసెంబ్లీ, కౌన్సిల్‌కు పలు జాయింట్‌ కమిటీలను కూడా నియమించారు.

ఎమినిటీస్, వన్యప్రాణి–పర్యావరణ ప­రి­రక్షణ కమిటీల చైర్మన్‌గా తమ్మినేని, ఎస్సీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా గొల్ల బాబూరావు, ఎస్టీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా  బాలరాజు, మైనారిటీ­ల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా ముస్తఫా, మహిళ, శిశు, ది­వ్యాం­గులు, వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్‌­పర్స­న్‌­గా జొన్న­లగడ్డ పద్మావతి, సబార్డినేట్‌ లెజిస్లేషన్‌ కమి­టీ చైర్మన్‌గా మర్రి రాజశేఖర్, బీసీల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా రమే‹Ùయాదవ్, లైబ్రరీ కమి­టీ చైర్మన్‌గా పి.రామసుబ్బారెడ్డిని నియమించారు.    

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)