Breaking News

ఒక్క మరుగుదొడ్డీ లేదా?

Published on Thu, 04/24/2025 - 04:00

సాక్షి, అమరావతి: రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యాలయంలో సామాన్యుల కోసం ఒక్క మరుగుదొడ్డి కూడా లేకపోవడం పట్ల హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇది తమను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ కార్యాలయంలో కనీస మౌలిక సదుపా­యాలు కూడా లేకపోవడం ఏమిటని ప్రశ్నించింది. మరుగుదొడ్డి కూడా లేకపోతే సమాచార కమిషన్‌ కార్యాలయానికి వచ్చే సామాన్యులు, ముఖ్యంగా మహిళల పరిస్థితి ఏమిటని నిలదీసింది. మౌలిక సదుపాయాల కల్పనను ప్రభుత్వం విస్మరించిందా? అంటూ సందేహం వ్యక్తం చేసింది. 

మరుగుదొడ్డి లేకుంటే సమాచార కమిషన్‌ను మరో చోటుకి తరలించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)ని ఆదేశించింది. లేకుంటే వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిస్తామని తేల్చి చెప్పింది. పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్ర సమాచార కమిషన్‌ కార్యాలయంలో కనీస మౌలిక సదుపాయాలు ముఖ్యంగా మరుగుదొడ్డి సౌకర్యం కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రంగారెడ్డి జిల్లాకు చెందిన బి.కాంత్రికుమార్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఉప్పలూరి అభినవ్‌ కృష్ణ వాదనలు వినిపిస్తూ, సమాచార కమిషన్‌ సామాన్యుల కోసం ఒక్క మరుగుదొడ్డి కూడా లేదన్నారు. 

ప్రభుత్వ్ర ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, భవన యజమానితో వివాదం కొనసాగుతోందన్నారు. కొంత సమయం ఇస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతానని ఆమె తెలిపారు.  

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)