Breaking News

హైకోర్టు సాక్షిగా తేలిపోయిన ‘ఈనాడు’ అసత్య ఆరోపణలు 

Published on Thu, 03/28/2024 - 04:46

సాక్షి, అమరావతి: ‘సాక్షి’ దినపత్రిక తన సర్కులేషన్‌ పెంచుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ‘ఈనాడు’ అడ్డగోలుగా చేస్తూ వచ్చిన ఆరోపణలు అసత్యమని ఢిల్లీ హైకోర్టు సాక్షిగా తేలిపోయాయి. వలంటీర్లు విస్తృత సర్క్యులేషన్‌ కలిగిన ఏ దినపత్రికనైనా కొనుగోలు చేయవచ్చంటూ ప్రభుత్వం జీవో జారీ చేయగా దీనివల్ల సాక్షి సర్క్యులేషన్‌ ఆమాంతం పెరిగిపోయిందంటూ ఈనాడు ప్రమాణపూర్వకంగా చెప్పిన మాటలు, శుద్ధ అబద్ధమని ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్కులేషన్‌ (ఏబీసీ) ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి.

ప్రభుత్వ జీవో వల్ల సాక్షి నిజంగానే లబ్ధి పొంది ఉంటే ఆ పత్రిక సర్క్యులేషన్‌ మిమ్మల్ని దాటిపోయి ఉండాలి కదా? మరి ఏబీసీ గణాంకాలు మరో రకంగా ఉన్నాయి కదా? అంటూ హైకోర్టు ధర్మాసనం సూటిగా సంధించిన ప్రశ్నలకు ఈనాడు వద్ద సమాధానమే లేకుండా పోయింది. సాక్షి సర్క్యులేషన్‌ విషయంలో తన ఆరోపణల్లో నిజం లేదని తేలడంతో చేసేదేమీ లేక ఈనాడు వెనక్కి తగ్గింది. హైకోర్టు సైతం సాక్షి సర్క్యులేషన్‌ గణాంకాలను  ప్రచురించేందుకు అనుమతినిచ్చింది.

దీంతో చేసేదేమీ లేక సాక్షి సర్క్యులేషన్‌ గణాంకాలను  ప్రచురించకుండా ఏబీసీని నిరోధించాలంటూ దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాన్ని ఈనాడు ఉపసంహరించుకుంది. విస్తృత సర్క్యులేషన్‌ ఉన్న ఏ దినపత్రికనైనా కొనుక్కునేందుకు వలంటీర్లకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఈనాడు దాఖలు చేసిన ప్రధాన వ్యాజ్యంలో తదుపరి విచారణను ఏప్రిల్‌ 25కి వాయిదా వేసింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ మన్మోహన్, న్యాయమూర్తి జస్టిస్‌ మన్మీత్‌ ప్రతీమ్‌ సింగ్‌ ఆరోరా ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)