Breaking News

మాతో పెట్టుకుంటే కాల్చిపారేస్తాం!

Published on Sat, 09/21/2024 - 04:29

ఈనెల 9న పుట్టపర్తి పట్టణంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ‘నిన్ను నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా.. రక్తచరిత్ర.. రక్త చరిత్ర..’ అంటూ పాటలు వేసుకుని టీడీపీ శ్రేణులు ఇష్టారాజ్యంగా డ్యాన్సులు చేశారు. ఇవి చూసి భక్తజనం బెంబేలెత్తిపోయారు.

ఈనెల 10న రామగిరి మండలం కుంటిమద్ది గ్రామంలో టీడీపీ కార్యకర్త గంగాధర్‌ నాటు తుపాకీతో నానా హంగామా చేశాడు. అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత కేశవపై దాడి చేయబోయాడు. అతను అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. 

ఈనెల 11న మడకశిర మండలం గుండుమల గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా కొందరు యువకులు బహిరంగంగా కత్తులు, తుపాకీలతో విన్యాసాలు చేశారు. ఇది చూసి జనం బేజారెత్తిపోయారు.  

సాక్షి, టాస్‌్కఫోర్స్‌ : రాయలసీమ జిల్లాల్లో నాటు తుపాకుల సంస్కృతి మళ్లీ ఊపిరిపోసుకుంటోందనడానికి ఈ ఘటనలే తాజా ఉదాహరణలు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా నాటు తుపాకుల వాడకం విచ్చలవిడిగా సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణులు వీటితో బహిరంగంగా డ్యాన్సులు చేస్తూ చెలరేగిపోతున్నారు. దీంతో ‘ఆర్‌ఓసీ’ రోజులు మళ్లీ దాపురించాయా! అని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 

నిజానికి.. నాటు తుపాకులు, బాంబులు, కత్తులు.. ఈ మాటలు వింటే ఉమ్మడి అనంతపురంలో జిల్లాలో ఆర్‌ఓసీ (రీఆర్గనైజింగ్‌ కమిటీ) అరాచకాలు గుర్తుకొస్తాయి. అప్పట్లో టీడీపీకి చెందిన ఓ మాజీమంత్రి నేతృత్వంలో ఈ దారుణాలు విచ్చలవిడిగా సాగాయి. ఇందుకు ఎందరో బలయ్యారు. అయితే, ఇప్పుడు మళ్లీ నాటి రోజులు గుర్తొచ్చేలా ఆ పార్టీ నేతలు చెలరేగిపోతున్నారు. ఉదా.. రామగిరి మండలంలో మాజీమంత్రి పరిటాల సునీత అనుచరులు నాటు తుపాకులతో నానా హంగామా చేస్తున్నారు. 

‘మాతో పెట్టుకుంటే అంతే.. కాల్చిపడేస్తాం.. మళ్లీ మాకు పాత రోజులు వచ్చాయి’ అని రెచి్చపోతున్నారు. ఒకచోట గన్‌ ఘటన వెలుగులోకి రాగానే.. మరోచోట వినాయక నిమజ్జనంలో తుపాకులతో విన్యాసాలు చేశారు. ఇంకోచోట.. రక్తచరిత్ర పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేశారు.  


ఐదేళ్లలో అభివృద్ధి పనులు.. 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రామగిరి మండల వ్యాప్తంగా పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. కుంటిమద్ది గ్రామంలో కూడా రోడ్లు వేశారు. తాగునీటి సౌకర్యం కలి్పంచారు. ఫలితంగా ఈ ప్రాంతం ఫ్యాక్షన్‌ ప్రభావం నుంచి బయటపడుతున్న సమయంలో ఇప్పుడు మళ్లీ పరిటాల కుటుంబం ఆ గ్రామంలో ఫ్యాక్షన్‌ వాతావరణానికి ఆజ్యం పోస్తోందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. 

వినాయక చవితి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాల్సి ఉండగా..  గ్రామాల్లో కొందరు టీడీపీ అల్లరిమూకలు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా చెలరేగిపోయారు. నాటు తుపాకులు, కత్తులు, డమ్మీ తుపాకులు చూపించి ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నారు. ఇదేంటని ప్రశి్నంచిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. దీంతో మళ్లీ ‘ఆర్‌ఓసీ’ కాలంలో మాదిరిగా టీడీపీ నేతలు బరితెగిస్తున్నారని ప్రజలు వణికిపోతున్నారు. 

శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తే సహించం.. 
తుపాకులు వాడాలంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. అనుమతులు పొందిన వారే వాడాలి. ఎవరుపడితే వారు నాటు తుపాకులతో రెచ్చిపోతే కేసులు తప్పవు. పండుగ వాతావరణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే సహించేదిలేదు. 
– వి. రత్న, శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)