Breaking News

దేశ రక్షణ వ్యవస్థలో భాగస్వాములు కండి

Published on Sun, 07/12/2026 - 05:29

సాక్షి, విశాఖపట్నం: దేశ రక్షణ వ్యవస్థను మరింతగా పటిష్టం చేయడంలో యువ పారిశ్రామికవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తలు భాగస్వాములు కావాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పిలుపునిచ్చారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం, సాంకేతికతతో ముంబైలోని మజాగాన్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్మించిన అత్యాధునిక స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ‘ఐఎన్‌ఎస్‌ మహేంద్రగిరి’ భారత నౌకాదళంలోకి అధికారికంగా ప్రవేశించింది. 

శనివారం విశాఖలోని నేవల్‌ డాక్‌యార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రక్షణ శాఖ మంత్రి ఈ యుద్ధ నౌకను జాతికి అంకితం చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ఈ అత్యాధునిక యుద్ధనౌక ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ఆశయాలకు గొప్ప ప్రతీకగా అభివర్ణించారు. సముద్ర జలాల్లో మన డిజైన్‌ సామర్థ్యాలకు, నౌకా నిర్మాణ వ్యవస్థ అభివృద్ధికి ఇది స్పష్టమైన ప్రతిబింబమని చెప్పారు. సాధారణంగా ఒక యుద్ధ నౌకకు 5 నుంచి 7 సీ ట్రయిల్స్‌ నిర్వహిస్తారని, కానీ మహేంద్రగిరి నౌక కేవలం ఒకే ఒక్క సీ–ట్రయల్‌తో విజయవంతంగా నౌకా దళంలో చేరడం విశేషమని అన్నారు. 

అలాగే ఒక నౌక నిర్మాణానికి 95 నెలలు సమయం పడుతుందని, కానీ ఈ నౌక 20 నెలల సమయాన్ని ఆదా చేసి 75 నెలల్లోనే పూర్తవడం మరో విశేషమన్నారు. భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్‌ మాట్లాడుతూ భారత నౌకాదళం ఎల్లప్పుడూ యుద్దానికి సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకా దళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భల్లా, మజ్‌గాన్‌ డాక్‌ సీఎండీ కెప్టెన్ జగ్‌మోహన్, నౌకాదళ సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)