Breaking News

విశాఖలో 2..చీరాలలో 2

Published on Sun, 07/19/2026 - 02:49

సాక్షి, అమరావతి: బీచ్‌ బార్ల ఏర్పాటు కార్యాచరణను చంద్రబాబు ప్రభుత్వం వేగవంతం చేసింది. విశాఖ, చీరాల బీచ్‌లలో బీచ్‌ బార్లను పైలట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం విధాన నిర్ణ­యం తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లోని ప్రధాన కేంద్రా­ల్లో బీచ్‌ బార్లను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించింది. బీచ్‌ బార్ల ఏర్పాటుకు విధి విధానాలను ఖరారు చేస్తూ శనివారం ఉత్తర్వులిచ్చింది. ఇక రెండో దశ కార్యాచరణ దిశగా బీచ్‌బార్ల సంఖ్యను సూత్రప్రాయంగా నిర్ణయించింది. 

విశాఖ, చీరాలలో పైలట్‌ ప్రాజెక్టు కింద రెండేసి బీచ్‌ బార్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. విశాఖలోని ఆర్కే బీచ్‌ సమీపంలో ఒకటి, తొట్లకొండ–రుషికొండ మధ్యలో మరొకటి ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్‌ శాఖ ప్రతిపాదించింది. చీరాలలో కూడా బీచ్‌ బార్లకు అనువైన రెండు ప్రదేశాలను గుర్తించింది. ఈ మేరకు త్వరలోనే విడుదల చేయనున్న నూతన మద్యం విధానంలో దీనిని అధికారికంగా ప్రకటించనుంది. 

అనంతరం ఈ బీచ్‌ బార్ల లైసెన్స్‌ కేటాయించేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఎక్సైజ్‌ శాఖ భావిస్తోంది. ఈపైలట్‌ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం 2027 జనవరి నాటికే రాష్ట్రంలోని శ్రీకాకుళం నుంచి తిరుపతి జిల్లా వరకు ఉన్న తీరంలో బీచ్‌ బార్ల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా ఉంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)