Breaking News

వైద్య విద్య ప్రవేశాల్లో పారదర్శకతకు పాతర

Published on Tue, 12/09/2025 - 02:45

సాక్షి, అమరావతి: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియలో పారదర్శకతకు చంద్రబాబు ప్రభుత్వం పాతర వేసింది. బీడీఎస్‌ సీట్లు ఎన్ని ఖాళీగా ఉన్నాయో ప్రకటించకుండానే విద్యార్థులకు కేటాయింపు చేపట్టింది. మూడో విడత బీడీఎస్‌ కనీ్వనర్‌ సీట్ల కేటాయింపు ప్రొవిజనల్‌ లిస్ట్‌ను సోమవారం ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. వాస్తవానికి రెండో విడత కౌన్సెలింగ్‌లో విద్యార్థులు చేరని, వదులుకున్న సీట్ల వివరాలను తొలుత ప్రకటించాలి. ఇలా ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయో విద్యార్థుల ముందుంచాకే తదుపరి కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించాల్సి ఉంటుంది.

ఈ ఏడాది అక్టోబర్‌ 23న విశ్వవిద్యాలయం రెండో విడత కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయించింది. విద్యార్థులకు ఫ్రీ–ఎగ్జిట్‌ అవకాశం కల్పించింది. నవంబర్‌ 20తోనే దేశంలో మెడికల్‌ యూజీ ప్రవేశాల గడువు ముగిసింది. అయితే ఎంబీబీఎస్‌ ప్రవేశాలను తప్పుల తడకగా చేపట్టి వాటిని సరిదిద్దుకోవడంలోనే వర్సిటీ కాలయాపన చేసింది. దీంతో తుది దశ బీడీఎస్‌ కౌన్సెలింగ్‌ చేపట్టలేదని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

ఇదిలా ఉండగా, రెండో దశ కౌన్సెలింగ్‌ ముగిసిన నెలన్నర అనంతరం నేరుగా మూడో దశ కౌన్సెలింగ్‌ ప్రొవిజనల్‌ సీట్ల కేటాయింపు జాబితాను సోమవారం వర్సిటీ విడుదల చేసింది. ఖాళీల వివరాలు ప్రకటించకుండా సీట్ల కేటాయింపు చేపట్టడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రొవిజనల్‌ సీట్ల కేటాయింపులో అభ్యంతరాలుంటే మంగళవారం మధ్యాహ్నం 2 గంటల్లోపు తెలియజేయడానికి అవకాశం ఇచ్చారు.  

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి