Breaking News

బీసీలను రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న సీఎం జగన్‌

Published on Sun, 02/26/2023 - 03:57

భవానీపురం (విజయవాడ పశ్చిమ):  దేశ చరిత్రలో బీసీలను గుర్తించడమే కాకుండా, వారిని రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పలువురు బీసీ సంఘాల నేతలు ప్రశంసించారు. మున్నెన్నడూ లేని విధంగా బీసీలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం కల్పించడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమన్నారు.

2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీసీలందరూ మూకుమ్మడిగా సీఎం జగన్‌కు మరోమారు పట్టం కట్టనున్నారని వారు స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవన్‌లో ‘బీసీలు­–­జగనన్న ప్రభుత్వం ప్రాధాన్యత’ అంశంపై శనివారం జరిగిన చర్చా వేదిక నిర్వహించారు. పలువురు వక్తలు మాట్లాడుతూ సామాజిక సాధికారత సాధనలో సీఎం జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు.

ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా శాసన మండలిలో ఈ స్థాయిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గా­లకు ఏనా­డూ ప్రాతినిథ్యం కల్పించిన దాఖలాల్లేవన్నా­రు. నాడు చంద్రబాబు సామాజిక అన్యాయానికి పాల్పడ­గా.. సీఎం జగన్‌ ఆయా వర్గాల సాధికారత కోసం నిబద్ధతతో అడుగులేస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్‌.కృష్ణయ్య ఫోన్‌లో తన సందేశాన్ని వినిపించారు.

ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొ­రేషన్‌ చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్, ఓబీసీ సంఘం జా­తీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్‌యాదవ్,  బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు బుద్ధా నాగేశ్వరరా­వు, బీసీ ఇంటర్నేషనల్‌ అధ్యక్షుడు ఎన్‌వీ రావు, రాష్ట్ర రజక సంఘాల గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ రాచకొండ జాన్‌బాబు, ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి పాల్గొన్నారు.    

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)