Breaking News

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌

Published on Sat, 08/24/2024 - 05:44

సాక్షి, అమరావతి/వెంకటాచలం: రెంటచింతల, కారంపూడి పోలీసులు నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. రూ.50 వేలతో రెండు పూచీకత్తులు సమ­ర్పించాలని పిన్నెల్లిని ఆదేశించింది. చార్జిషీట్‌ దాఖలు చేసేంత వరకు వారంలో ఒక రోజు సంబంధిత ఎస్‌హెచ్‌వో ముందు హాజ­రు కావాలని చెప్పింది. పాస్‌పోర్టును మేజి­స్ట్రేట్‌ కోర్టులో స్వా­ధీనం చేయాలని, అను­మతి లేకుండా దేశం దాటి వెళ్లకూడదని, ఎప్పుడు అవసరమైనా దర్యాప్తునకు అందుబాటు­లో ఉండాలని ఆదేశించింది. 

ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన వ్య­క్తులను వాటిని కోర్టుకు, పోలీసు అధికారికి తెలి­యజేయకుండా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెది­రించడం, ప్రలో­భపెట్టడం వంటివి చేయరా­దని స్పష్టం చేసింది. నివాస స్థలం, మొబైల్‌ నంబరు వివ­రాలను దర్యా­ప్తు అధికారికి తెలపాలని, ఒక­వేళ అవి మారి­తే వెంటనే ఆ విషయాన్ని తెలియ­జేయాలని చెప్పింది. ప్రస్తుత కేసుల్లో తన పాత్ర గురించి ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియాతో మాట్లా­డరాదని ఆదేశించింది. 

ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని పేర్కొంటూ జస్టిస్‌ తల్లాప్రగఢ మల్లికార్జునరావు శుక్రవారం తీర్పు చెప్పారు. దర్యాప్తు అధికారి పిన్నె­ల్లిని విచారణకు పిలిచినప్పుడు వెంట న్యా­య­వాదిని తీసుకెళ్లే వెసులుబాటు కల్పించాలని ఆయన తరపు న్యాయవాది కోరగా.. ఆ పరిస్థితి వస్తే కోర్టు­లో పిటిషన్‌ దాఖలు చేసుకో­వాలని న్యాయమూర్తి çసూచించారు. పిన్నెల్లిపై నమోదైన కేసుల్లో బెయి­ల్‌ ఇచ్చేందుకు గురజాల కోర్టు ని­రాకరించడంతో పిన్నెల్లి బెయిల్‌ కోసం హైకో­ర్టులో పిటి­షన్లు దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యాలపై గురు­వా­రం విచారణ జరిపారు. ఈ కేసులో పిటి­షనర్‌ నుంచి పోలీసులు రాబట్టాల్సిన విషయా­లేవీ లే­నందున, ఆయన్ని నిరవధికంగా నిర్బంధించడం సమర్థనీ­యం కాదని న్యాయ­మూర్తి పేర్కొ­న్నారు. పిన్నెల్లి 4 సార్లు ఎమ్మెల్యే అని, ఆయనకు బలమైన సామాజిక సంబంధాలున్నాయని, ఆయన విచా­రణ నుంచి పారిపోయే అవకాశం లేదన్నారు. 
 


నేడు జైలు నుంచి పిన్నెల్లి విడుదల
బెయిల్‌ పత్రాలు జైలు అధికారులకు అందజేయ­డంలో ఆలస్యం కా­వడంతో శుక్ర­వా­రం పిన్నెల్లిని విడుదల చేయ­డానికి వీలుకాలేదు. ఆయన్ని శనివారం విడుదలయ్యే అవకాశముంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)