కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్
Breaking News
ఎమ్మెల్యే బడ్డుకొండ ఇంట పెళ్లి సందడి... హాజరైన మంత్రులు
Published on Thu, 08/11/2022 - 07:29
భోగాపురం (విజయనగరం): నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ఇంట పెళ్లిసందడి నెలకొంది. ఆయన పెద్ద కూమారుడు మణిదీప్‌నాయుడు వివాహ నిశ్చితార్థ వేడుక బుధవారం స్థానిక సన్‌రే రిసార్ట్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది.
కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్‌నాథ్, బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, ఏంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి, కంబాల జోగులు, గొర్లె కిరణ్‌కూమార్, నంబూరు శంకర్రావు, బొత్స అప్పలనరసయ్య, కడుబండి శ్రీనివాసరావు, శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్‌బాబు, పాకలపాటి రఘువర్మ, ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్, వైఎస్సార్‌సీపీ నాయకులు కందుల రఘుబాబు, కాకర్లపూడి శ్రీనివాసరాజు, ఉప్పాడ సూర్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. వారంతా నూతన వ«ధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
చదవండి: (నూతన దంపతులను ఆశీర్వదించిన వైఎస్ విజయమ్మ)
Tags : 1