Breaking News

భిన్న సంస్కృతుల ‘ప్రశాంతి’ నిలయం

Published on Sun, 06/02/2024 - 05:32

సాక్షి, పుట్టపర్తి: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి భిన్న సంస్కృతులకు నిలయంగా మారింది. ఇతర రాష్ట్రాలు, పలు దేశాల నుంచి భగవాన్‌ శ్రీసత్యసాయి బాబా భక్తులు వస్తుండటంతో దశా­బ్దాల కాలంగా ఇతర రాష్ట్రాల పండుగలు ప్రశాంతి నిలయంలో నిర్వహించడం ఆనవాయి­తీగా మారింది. కుల, మతాలకు అతీతంగా అన్ని పండుగలు చేస్తుంటారు. ఏటా గుజరాత్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల అవతరణ దినోత్సవాలు, ఆయా రాష్ట్రాల ప్రధాన పండుగలు నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా ఏదో ఒక రాష్ట్రం నుంచి భక్తులు పర్తియాత్రగా పుట్టపర్తి వస్తున్నారు.

అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను పుట్టపర్తిలో ప్రదర్శిస్తున్నారు. పుట్టపర్తి వంటకాలు, వస్త్రధారణకు విదేశీయులు సైతం ముగ్దులు కావడం విశేషం. ఇతర రాష్ట్రాల, దేశాల భక్తులు సైతం స్థానికులతో సులువుగా కలసిపోతు­న్నారు. ఫలితంగా దేశ, విదేశీ భాషలను స్థానికులు సులువుగా మాట్లాడగలుగుతున్నారు. చదువు రాని వారు సైతం ఆ భాషలను నేర్చుకుంటున్నారు.

విదేశాల నుంచి వచ్చే భక్తులు అక్కడి సంప్రదాయం వదిలి.. తెలుగు డ్రెస్‌ కోడ్‌ను ఇష్టపడుతున్నారు. మహిళలు చీరకట్టులో, పురుషులు పంచెకట్టులో కనిపిస్తున్నారు. సుమారు 150 దేశాల నుంచి భక్తులు పుట్టపర్తికి వస్తుంటారు. వీరిలో చాలామంది భారతీయ జీవనశైలికి అలవాటు పడుతున్నారు. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

మనకు గర్వకారణం
మేము తమిళ­నాడు నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తు­న్నాం. దశాబ్దాల కాలం నుంచి విదేశీయులను చూస్తు­న్నాం. మన సంప్రదాయాలను వారు ఆచరిస్తుండటం గర్వకారణంగా చెప్పుకో­వచ్చు. పాశ్చాత్య దేశస్తులు మన దుస్తులను ఇష్టపడుతున్నారు. ఇక్కడి వంటకాలు అందరినీ ఆకర్షిస్తాయి. – బాల దండపాణి, పుట్టపర్తి

సంప్రదాయాల కేంద్రం 
పలు దేశాల నుంచి భక్తి భావంతో పుట్ట­పర్తికి వస్తుంటారు. ఇక్కడి ప్రజల సహకా­రం బాగుంటుంది. మన సంస్కృతీ సంప్రదాయాలను విదేశీ­యులు పాటిస్తారు. దేశ, విదేశ భేదాలు లేకుండా పరస్పర సహకారంతో మెలుగుతుంటారు. ప్రశాంతతకు మారుపేరుగా నిలిచిన పుట్ట­పర్తి.. సంప్రదాయాలకూ కేంద్రంగా ఉందని చెప్పొచ్చు.  – ఆర్‌జే రత్నాకర్‌రాజు, మేనేజింగ్‌ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)