Breaking News

కపిల తీర్థం వద్ద అయ్యప్ప భక్తుల ఆందోళన..

Published on Wed, 11/12/2025 - 07:53

సాక్షి, తిరుపతి: తిరుపతిలో అయ్యప్ప భక్తుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు దిగింది. కపిల తీర్థం పుష్కరిణిలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల స్నానాలకు టీటీడీ అనుమతి ఇవ్వకపోవడంతో మాల ధరించిన స్వాములు ఆందోళనకు దిగారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకి వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు నినాదాలు చేశారు.

వివరాల ప్రకారం.. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం తెల్లవారుజామున అయ్యప్ప భక్తులు ఆందోళన దిగారు. కపిల తీర్థం పుష్కరిణిలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల స్నానాలకు టీటీడీ అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో తెల్లవారుజామున స్నానం ఆచరించే అయ్యప్ప భక్తుల పట్ల టీటీడీ కఠినంగా వ్యవహరిస్తోందని స్వాములు ఆరోపించారు. టీటీడీ వైఖరిపై భక్తులు, స్వాములు మండిపడుతున్నారు. ఎట్టకేలకు అయ్యప్ప భక్తుల ఆందోళనతో దిగివచ్చిన టీటీడీ వారి స్నానాలకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులు.. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్‌ నాయుడు డౌన్‌ డౌన్‌.. టీటీటీ డౌన్‌ డౌన్‌ అంటూ భక్తులు నినాదాలు చేశారు.

అయితే, కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో భక్తుల స్నానాలకు, దీపారాధనకు టీటీడీ అనుమతి ఇవ్వలేదు. భక్తుల తాకిడి తక్కువగా ఉన్నప్పటికీ భక్తులపై విజిలెన్స్ అధికారులు  ఆంక్షలు విధించారు. ఆలయంలో రద్దీ తగ్గుముఖం పట్టినప్పటికీ విజిలెన్స్ అధికారులు అత్యుత్సాహం చూపించారు. దీంతో, తమకు కార్తీక మాసంలో కపిలేశ్వర స్వామి సన్నిధిలో కోనేరు  దర్శనాన్ని దూరం చేస్తున్నరని భక్తులు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భక్తులు ఆందోళనకు దిగడం గమనార్హం. దీంతో, టీటీడీ దిగి వచ్చింది. 

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)